Telugu Global
Cinema & Entertainment

VI Anand | అదే టీమ్ తో వీఐ ఆనంద్ మరో సినిమా

VI Anand - అనీల్ సుంకరతో కలిసి ఊరు పేరు భైరవకోన అనే సినిమా చేశాడు వీఐ ఆనంద్. ఇప్పుడు అతడితోనే ఇంకో సినిమా చేయబోతున్నాడు.

VI Anand | అదే టీమ్ తో వీఐ ఆనంద్ మరో సినిమా
X

దర్శకుడు విఐ ఆనంద్ తన తాజా చిత్రం 'ఊరు పేరు భైరవకోన'తో ఓ మోస్తరు సక్సెస్ కొట్టాడు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో రన్ అవుతోంది. ఈరోజు ఈ దర్శకుడి పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ, అతని కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు.

ఊరు పేరు భైరవకోన చిత్రాన్ని సమర్పించిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకరతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రాజేష్ దండా, అజయ్ సుంకర సహ నిర్మాతలుగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రానికి డైలాగ్స్ అందించిన అబ్బూరి రవి, ఈ కొత్త సినిమాకు కూడా పని చేయనున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ఏ-టీవీ సమర్పిస్తోంది.

విఐ ఆనంద్ సూపర్ నేచురల్ అడ్వంచర్స్ చేయడంలో దిట్ట. ఈ కొత్త చిత్రం కథ, సెటప్ పరంగా యూనిక్ గా ఉండబోతోంది. ఈ మెగా-బడ్జెట్ లో నటించే హీరో ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తారు.

First Published:  20 Feb 2024 5:05 PM GMT
Next Story