Telugu Global
Cinema & Entertainment

Adipurush Movie: వెనక్కి తగ్గిన ప్రభాస్.. 100 కోట్లతో ఆదిపురుష్ కి రిపేర్లు

Adipurush Movie VFX: సినిమా ఫస్ట్ కాపీ రెడీ అవుతుందనుకున్న ఈ టైమ్ లో మార్పులంటే, అది కత్తిమీద సామే. కానీ ప్రభాస్ మూవీ కావడం, అందులోనూ బాలీవుడ్ దర్శకుడితో తీస్తున్న తొలి సినిమా కావడంతో ఆ మాత్రం సాహసం చేయక తప్పడంలేదు.

Adipurush Movie: వెనక్కి తగ్గిన ప్రభాస్.. 100 కోట్లతో ఆదిపురుష్ కి రిపేర్లు
X

బాహుబలితో తారా స్థాయికి వెళ్లిపోయిన ప్రభాస్ ఏ చిన్న కదలిక అయినా ఇప్పుడు పెద్ద సెన్సేషన్ అవుతోంది. ఆయన సినిమాలే కాదు, ట్రైలర్లు, టైటిళ్లు కూడా ముందుగా అభిమానులకు నచ్చాల్సిందే. ఆదిపురుష్ ట్రైలర్ విషయంలో అభిమానులు కాస్త హర్ట్ అయ్యారు. మరీ యానిమేషన్ మూవీలా ఉందని పెదవి విరిచారు. రావణుడు, ఆంజనేయుడు లుక్స్ పై అటు హిందూ సంఘాలు కూడా భగ్గుమన్నాయి. ఈ సినిమా బిగ్ స్క్రీన్ లో చూస్తే బాగుంటుందని, త్రీడీలో చూస్తే ఆ మజాయే వేరంటూ దర్శక నిర్మాతలు కవర్ చేసుకోవాలని చూసినా ఫలితం లేదు. దీంతో ఆదిపురుష్ కి రిపేర్ వర్క్ మొదలైంది.

100 కోట్లా..?

100 కోట్ల రూపాయల బడ్జెట్ తో మీడియం రేంజ్ సినిమాలు నాలుగు తీసేయొచ్చు. కానీ ఇక్కడ ప్రభాస్ మూవీ కదా. అందుకే దాని రిపేర్ ఖర్చులే 100 కోట్లు అవుతున్నాయని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. ఆదిపురుష్ లో మార్పులు చేర్పులకోసం వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం 100కోట్లు తాజాగా కేటాయించారట. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అవుతుందనుకున్న ఈ టైమ్ లో మార్పులంటే, అది కత్తిమీద సామే. కానీ ప్రభాస్ మూవీ కావడం, అందులోనూ బాలీవుడ్ దర్శకుడితో తీస్తున్న తొలి సినిమా కావడంతో ఆమాత్రం సాహసం చేయక తప్పడంలేదు. ఆది పురుష్ ని ఏ వంకా లేకుండా థియేటర్లలోకి తెచ్చేందుకు చెక్కుడు కార్యక్రమం మొదలు పెడుతున్నారు.


సమ్మర్ రేస్ నుంచి వెనక్కి తగ్గినట్టేనా..?

అప్పుడెప్పుడో కరోనా లాక్ డౌన్ లో అనౌన్స్ అయిన సినిమా ఇది. 2023 సంక్రాంతికి రిలీజ్ అనుకుని అంతా రెడీ చేసుకున్నారు. చివరకు సమ్మర్ రిలీజ్ అన్నారు. కానీ ఇప్పుడు అది కూడా కుదిరేలా లేదు. సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. లేటయినా పర్లేదు, ప్రభాస్ ఈసారి పెద్ద హిట్ కొట్టాల్సిందేనంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మరి 100కోట్ల రిపేర్ వర్క్ తర్వాతయినా సినిమా ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటుందో లేదో వేచి చూడాలి. హిందూ సంఘాల అభ్యంతరాలను కూడా ఈసారి పరిగణలోకి తీసుకుని మార్పులు చేర్పులు చేస్తున్నారు కాబట్టి.. ఆవైపు నుంచి కూడా ఆందోళనలు తగ్గే అవకాశముంది.

First Published:  6 Nov 2022 10:04 AM GMT
Next Story