Telugu Global
Cinema & Entertainment

chari 111 | వెన్నెల కిషోర్ సినిమా రెడీ

Vennela Kishore's Chari 111 - చాన్నాళ్ల తర్వాత వెన్నెల కిషోర్ హీరోగా మారాడు. చారి-111 అనే సినిమా చేశాడు. ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది.

chari 111 | వెన్నెల కిషోర్ సినిమా రెడీ
X

వెన్నెల కిశోర్ హీరోగా నటిస్తున్న సినిమా 'చారి 111'. టీజీ కీర్తి కుమార్ దర్శకుడు. సుమంత్ హీరోగా 'మళ్ళీ మొదలైంది' వంటి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ తీసిన తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. ఇందులో సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మార్చి 1న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు.

'చారి 111' రిలీజ్ డేట్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా, ప్రేక్షకుల్లో క్యూసియాసిటీ కలిగించే విధంగా డిజైన్ చేశారు. థియేటర్లలోకి గూఢచారిగా ప్రేక్షకుల్ని నవ్వించడానికి 'వెన్నెల' కిశోర్ వస్తున్నట్లు ఉంది. ఈ జనరేషన్ కమెడియన్లలో తనకంటూ సపరేట్ కామెడీ స్టైల్ క్రియేట్ చేసుకున్న ఆయన... ఈ సినిమాలో ఏ విధంగా నవ్విస్తారో థియేటర్లలో చూడాలి.

'చారి 111' ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కన్‌ఫ్యూజ్ అయ్యే గూఢచారిగా 'చారి' పాత్రలో వెన్నెల కిశోర్ కనిపిస్తారని దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే యాక్షన్ సినిమా తీశామని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు.

ఇదొక స్పై యాక్షన్ కామెడీ సినిమా. సిల్లీ మిస్టేక్స్ చేసే ఒక స్పై పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడనేది సినిమా. వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్ స్పై రోల్స్ చేశారు. వాళ్లకు బాస్ గా మురళీ శర్మ చేశారు. సైమన్ కె కింగ్, ఈ సినిమాకు సంగీతం అందించాడు.




First Published:  8 Feb 2024 5:23 PM GMT
Next Story