Telugu Global
Cinema & Entertainment

Chaari 111 | జేమ్స్ బాండ్ గా వెన్నెల కిషోర్

Vennela Kishore - వెన్నెల కిషోర్ హీరోగా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి కిషోరుడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Chaari 111 | జేమ్స్ బాండ్ గా వెన్నెల కిషోర్
X

వెన్నెల కిశోర్ హీరోగా నటిస్తున్న సినిమా 'చారి 111'. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ హీరోగా నటించిన హిట్ సినిమా 'మళ్ళీ మొదలైంది' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

'చారి 111' కాన్సెప్ట్ టీజర్ సినిమా అనౌన్స్ చేసినప్పుడే విడుదలైంది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సిటీకి ప్రమాదం రావడం ఆ కేసును పరిష్కరించడానికి అయోమయం గూఢచారి చారి (వెన్నెల కిశోర్) వస్తాడు. ఆ కేసును చారి ఎలా సాల్వ్ చేశాడనేది సినిమాగా తెలుస్తుంది. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... 'వెన్నెల' కిశోర్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. హీరోయిన్ సంయుక్తా విశ్వనాథ్ గ్లామర్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ రోల్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే యాక్షన్ సినిమాగా రూపొందుతున్న 'చారి 111'లో ఓ సీరియస్ మలుపు కూడా ఉండబోతుంది.

'చారి 111' ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్ వెనుక చూస్తే చార్మినార్ కనిపిస్తోంది. హైదరాబాద్ సిటీ నేపథ్యం కథ అని తెలుస్తోంది. ఇంకా బాంబు బ్లాస్ట్ దృశ్యాలు, స్టైలిష్ కారు కూడా ఉన్నాయి. అసలు కథ ఏమిటనేది తెలియడానికి మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి.

ఇదొక స్పై యాక్షన్ కామెడీ సినిమా. సిల్లీ మిస్టేక్స్ చేస్తూ, కన్ ఫ్యూజ్ అయ్యే గూఢచారి 'వెన్నెల' కిశోర్ ఓ పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడనేది సినిమాలో చూడాలి. గూఢచారి సంస్థ హెడ్‌గా కథలో కీలకమైన పాత్రలో మురళీ శర్మ కనిపిస్తాడు. తాగుబోతు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

First Published:  15 Nov 2023 4:03 PM GMT
Next Story