Telugu Global
Cinema & Entertainment

ఫస్టాఫ్ వెన్నెల కిషోర్.. సెకెండాఫ్ బ్రహ్మాజీ

మాచర్ల నియోజకవర్గంలో యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు, మంచి కామెడీ కూడా ఉందంట. ఆ బాధ్యతను వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తీసుకున్నారట.

ఫస్టాఫ్ వెన్నెల కిషోర్.. సెకెండాఫ్ బ్రహ్మాజీ
X

మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయనే విషయం ట్రయిలర్ చూస్తేనే తెలుస్తోంది. మంచి డాన్స్ నంబర్ ఉందనే విషయం లిరికల్ వీడియో చూస్తే అర్థమౌతుంది. మరి కామెడీ సంగతేంటి? దీనిపై నితిన్ స్పందించాడు. కామెడీ కోసం వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ ఉన్నారని చెబుతున్నాడు.

"మాచర్ల నియోజకవర్గం సినిమాలో మంచి కామెడీ కూడా ఉంది. ఫస్టాఫ్ లో కామెడీ పండించే బాధ్యతను వెన్నెల కిషోర్ తీసుకున్నాడు. ఇక సెకెండాఫ్ లో ఆ బాధ్యతను బ్రహ్మాజీ తీసుకున్నారు. వీళ్లిద్దరి కామెడీ సినిమాలో హైలెట్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఫస్టాప్ లో నాకు, వెన్నెల కిషోర్ కు మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా ఉంటాయి."

ఇలా మాచర్ల నియోజకవర్గం సినిమాలో కామెడీ కూడా ఉందని చెప్పుకొచ్చాడు నితిన్. కెరీర్ లో తొలిసారి కలెక్టర్ పాత్ర పోషించిన ఈ హీరో, ఆ క్యారెక్టర్ కోసం పెద్దగా హార్డ్ వర్క్ చేయలేదని స్పష్టం చేశాడు. ఐఏఎస్ ల మేనరిజమ్స్ ఎలా ఉంటాయో, దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పరిశీలించాడని, అతడు చెప్పింది తను ఫాలో అయ్యానని అన్నాడు.

ఇక మేకోవర్ కు సంబంధించి కాస్త గంభీరమైన లుక్ కోసం మీసాలు పెంచానని, అంతకుమించి తను వర్క్ చేసింది ఏమీ లేదని స్పష్టం చేశాడు. ఈ సినిమాలో తనను ఓ ఐఏఎస్ ఆఫీసర్ గా కంటే, ఓ యాక్షన్ హీరోగానే ఎక్కువగా చూస్తారని చెప్పుకొచ్చాడు నితిన్.


First Published:  11 Aug 2022 10:37 AM GMT
Next Story