Telugu Global
Cinema & Entertainment

Saindhav | సైంధవ్ ట్రయిలర్ ఎలా ఉందంటే..?

Saindhav - సైంధవ్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. తాజాగా ట్రయిలర్ కూడా రిలీజ్ చేశారు.

Saindhav | సైంధవ్ ట్రయిలర్ ఎలా ఉందంటే..?
X

విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ 75వ చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ యూనిక్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్ని ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకొని సంక్రాంతికి జనవరి 13 న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో, ప్రమోషన్స్ లో మరింత దూకుడు పెంచింది టీమ్. ఇందులో భాగంగా ఈ రోజు, థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

పాప డ్యాన్స్ చేస్తూ తన తండ్రిని అనుకరిస్తూ చాలా ప్లజెంట్ గా ట్రైలర్ ప్రారంభమైంది. ఓపెనింగ్ సీక్వెన్స్ తండ్రీకూతుళ్ల బంధాన్ని అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేసింది. తండ్రికి తన కూతురే సర్వస్వం. కూతురుకి తండ్రి సూపర్‌ హీరో.

దురదృష్టవశాత్తు, ఆమెకు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. వ్యాధిని నయం చేసే ఇంజక్షన్ ధర అక్షరాలా 17 కోట్ల రూపాయలు. దీంతో హీరో తన పాత స్నేహితులను, ప్రత్యర్థులను తిరిగి కలవాలని నిర్ణయించుకుంటాడు. అతని గతం ఏమిటి? ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ మొదలైన బ్యాచ్‌తో అతనికి ఉన్న సంబంధం ఏంటనేది స్టోరీ.

సినిమా కథాంశాన్ని గోప్యంగా ఉంచిన దర్శకుడు శైలేష్ కొలను ఎట్టకేలకు ట్రైలర్ లో స్టోరీలైన్ ను కొంచెం బయటపెట్టాడు. ట్రైలర్‌ని బట్టి చూస్తే పాప సినిమాకి సోల్. తన కుమార్తె కోసం శాంతి మార్గంలో నడవాలని ఎంచుకున్న తండ్రి ఆమె కోసం హింసాత్మక మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.

దర్శకుడు కథలో రెండు విభిన్నమైన లేయర్స్ ని మిళితం చేశాడు. ఇది ఫ్యామిలీస్ తో పాటు యాక్షన్, థ్రిల్లర్ సినిమా ప్రేమికులకు నచ్చేలా చేసింది. సైకోగా వెంకటేష్ ఈ చిత్రాన్ని తన భుజాలపై మోశారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ క్లాస్, మాస్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది. అతను సాధారణ మధ్యతరగతి తండ్రిగా కనిపించినప్పటికీ, తన శత్రువులతో పోరాడినప్పుడు వైల్డ్ గా కనిపించారు. ట్రయిలర్, సినిమాపై అంచనాల్ని పెంచింది.

First Published:  3 Jan 2024 4:30 PM GMT
Next Story