Telugu Global
Cinema & Entertainment

Saindhav - సైంధవ్ మూవీ షూటింగ్ అప్ డేట్స్

Saindhav Movie Shooting Updates - శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ చేస్తున్న సినిమా సైంధవ్. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ చూద్దాం..

Saindhav - సైంధవ్ మూవీ షూటింగ్ అప్ డేట్స్
X

విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్ మార్క్ చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా సినిమాకు సంబంధించి హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తిచేశారు..

మొదటి షెడ్యూల్ లో ప్రధాన నటులపై కీలకమైన సన్నివేశాలను, ఫైట్ సీక్వెన్స్ ను గ్రాండ్ గా రూపొందించారు. ఇక ఓ పాట చిత్రీకరణ కోసం భారీ సెట్ వేశారు. త్వరలోనే ఈ సెట్ లో సెకెండ్ షెడ్యూల్ మొదలవుతుంది.

వెంకటేష్ కెరీర్లో ఇది భారీ బడ్జెట్ సినిమా. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. వెంకీ-నవాజుద్దీన్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయి.

సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.

First Published:  12 April 2023 1:52 AM GMT
Next Story