Telugu Global
Cinema & Entertainment

Saindhav | సంక్రాంతి బరిలో వెంకీ సినిమా

Venkatesh's Saindhav - సైంధవ్ అనే సినిమా చేస్తున్నాడు వెంకటేష్. కెరీర్ లో అతడికిది 75వ చిత్రం. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది.

Saindhav | సంక్రాంతి బరిలో వెంకీ సినిమా
X

విక్టరీ వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం సైంధవ్. శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌పై వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకులముందుకు రానుంది. యూనిక్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని విడుదల చేయడానికి పండుగ సీజన్ బెస్ట్ ఛాయిస్ అని మేకర్స్ భావించారు.

మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసినట్లుగా, జనవరి 13 న సంక్రాంతి పండుగకు ఒక రోజు ముందు సైంధవ్ రాబోతున్నాడు. పోస్టర్‌లోవెంకటేష్, బేబీ సారాతో కనిపించారు.

వెంకటేష్‌కు సంక్రాంతి మోస్ట్ సక్సెస్ ఫుల్ సీజన్. లాంగ్ హాలీడేస్ సినిమాకి అడ్వాంటేజ్ కానున్నాయి. అంతేకాకుండా, ఈ పాన్ ఇండియా చిత్రాన్ని జాతీయ స్థాయిలో ప్రచారం చేయడానికి మేకర్స్ కు తగినంత సమయం లభిస్తుంది.

నిజానికి ఈ సినిమాను క్రిస్మస్ కు షెడ్యూల్ చేశారు. కానీ ఊహించని విధంగా డిసెంబర్ 22కు సలార్ సినిమా వచ్చి పడింది. దీంతో సైంధవ్ సినిమాను వాయిదా వేయక తప్పలేదు. అలా క్రిస్మస్ నుంచి తప్పుకున్న సైంధవ్ సినిమా ఏకంగా సంక్రాంతికి షెడ్యూల్ అయింది. ఆల్రెడీ రేసులో మహేష్ బాబు, రవితేజ, నాగార్జున లాంటి హీరోల సినిమాలున్నప్పటికీ.. సైంధవ్ కు థియేటర్లకు సమస్య ఎదురు కాదు. అందుకే ధైర్యంగా సంక్రాంతికి వేశారు. పైగా వెంకటేష్ కు సంక్రాంతి సెంటిమెంట్ ఉండనే ఉంది.

సైంధవ్ సినిమాలోని 8 పాత్రలున్నాయి. వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిక్, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరేమియా, సారా, జయప్రకాష్ ఈ కీలక పాత్రల్ని పోషించారు. ఈ పాత్రలన్నింటినీ డిఫరెంట్ పోస్టర్ల ద్వారా పరిచయం చేశారు.

పాపులర్ కంపోజర్ సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించగా, మణికందన్ డీవోపీగా పని చేస్తున్నారు. గ్యారీ బిహెచ్ ఎడిటర్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. సైంధవ్ షూటింగ్ పార్ట్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ సినిమా అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోయిన్లు ఉండరట. కేవలం పాత్రలు మాత్రమే కనిపిస్తాయట.




First Published:  6 Oct 2023 1:26 AM GMT
Next Story