Telugu Global
Cinema & Entertainment

Saindhav Teaser | వెంకీ సినిమా టీజర్ రెడీ

Venkatesh'a Saindhav Movie - వెంకీ కెరీర్ లో 75వ చిత్రం సైంధవ్. ఈ సినిమా టీజర్ రెడీ అయింది. తేదీ కూడా ప్రకటించారు.

Saindhav Teaser | వెంకీ సినిమా టీజర్ రెడీ
X

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. వెంకీ కెరీర్ లో ఇది ప్రతిష్టాత్మక 75వ చిత్రం. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది.

ఈ చిత్రం టీజర్‌ రెడీ అయింది. అక్టోబర్ 16న సైంధవ్ టీజర్ ను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మరో యాక్షన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని సినిమా ప్రారంభం నుంచి చెబుతూ వస్తున్నారు. చెప్పినట్టుగానే యాక్షన్ గ్లింప్స్ రిలీజ్ చేశారు, పోస్టర్లలో కూడా అదే కనిపిస్తోంది.

నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా, లాంటి నటీనటులు ఇందులో కనిపించబోతున్నారు. బాలీవుడ్ నటుడు నవజుద్దీన్ సిద్దిఖీకి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. అటు ఆండ్రియా కూడా లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగుతెరపై కనిపిస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అన్ని పాత్రల ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు. సినిమా థీమ్ ను చెప్పేలా గ్లింప్స్ కూడా విడుదల చేశారు. టీజర్ రిలీజైతే, సినిమాపై ఇంకాస్త ఐడియా వస్తుంది. టీజర్ ద్వారా సైంధవ్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు దర్శకుడు శైలేష్.

స్టార్ కంపోజర్ సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడంలో దిట్ట అనిపించుకున్న సంతోష్ నారాయణన్, సైంధవ్ ను తన మ్యూజిక్ తో నెక్ట్స్ లెవెల్లో నిలబెట్టాడనే టాక్ ఇప్పటికే ఉంది. నిజానికి ఈ సినిమాను క్రిస్మస్ కు రిలీజ్ చేయాలనుకున్నారు. సలార్ పోస్ట్ పోన్ అవ్వడంతో, సంక్రాంతికి షెడ్యూల్ చేశారు.




First Published:  13 Oct 2023 1:51 AM GMT
Next Story