Telugu Global
Cinema & Entertainment

వెంకీ సైంధవ్ లో మరో స్టార్ హీరో

ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చి ఆఖరు లేదా ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రారంభం కానుంది. కాగా తాజాగా సైంధవ్ లో ఓ కీలక పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ హీరో ఆర్యను తీసుకున్నట్లు తెలుస్తోంది.

వెంకీ సైంధవ్ లో మరో స్టార్ హీరో
X

సీనియర్ హీరో వెంకటేష్ తన కెరీర్ మొత్తంలో ఎక్కువగా ఫ్యామిలీ సినిమాల్లోనే నటించాడు. మధ్యలో జయం మనదేరా, గణేష్, ఘర్షణ వంటి యాక్షన్ సినిమాలతోనూ మెప్పించాడు. అయితే వెంకటేష్ నుంచి చాలా ఏళ్లుగా యాక్షన్ సినిమా రాలేదు. ఇటీవల వచ్చిన నారప్ప మాస్ మూవీ అయినప్పటికీ అందులో వెంకటేష్ తండ్రి పాత్ర పోషించాడు. దీంతో వెంకీ పూర్తిస్థాయి యాక్షన్ సినిమాను చేస్తే చూడాలని చాలా రోజులుగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇదిలా ఉండగా హిట్ ఫ్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ కొలను ఇటీవల వెంకీతో సైంధవ్ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభం కాగా, షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ మూవీ నుంచి ఒక చిన్న టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని సప్రైజ్ చేశారు. అందులో వెంకటేష్ పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా కనిపించాడు. గన్ చేతిలో పట్టుకొని వెంకీ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ ని మెప్పించాయి. అంతేకాదు ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వెంకటేష్ కెరీర్ లో ఇదే తొలి పాన్ ఇండియా సినిమా.

కాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చి ఆఖరు లేదా ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రారంభం కానుంది. కాగా తాజాగా సైంధవ్ లో ఓ కీలక పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ హీరో ఆర్యను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ కు ఆర్య అయితే బాగుంటుందని భావించిన చిత్ర బృందం ఆయనను సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం. సైంధవ్ లో ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా, ఇప్పుడు ఆర్య కూడా చేరడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా సైంధవ్ సినిమాను వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నాడు.

First Published:  20 Feb 2023 6:34 AM GMT
Next Story