Telugu Global
Cinema & Entertainment

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మరోసారి వెంకీ?

మరోసారి వెంకటేష్ ను డైరక్ట్ చేయబోతున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఈసారి వెంకీని మరో కొత్త కోణంలో ఆవిష్కరించబోతున్నాడట.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మరోసారి వెంకీ?
X

విక్టరీ వెంకటేష్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మధ్య అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలో పెద్దోడిగా వెంకీని చక్కగా చూపించాడు అడ్డాల. ఆ తర్వాత నారప్పలో ఎగ్రెసివ్ వెంకటేష్ ను ఆవిష్కరించాడు. ఇప్పుడు వెంకీని మరో కొత్త కోణంలో చూపించబోతున్నాడు ఈ దర్శకుడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు వెంకటేశ్.

తండ్రి పాత్రలు వెంకటేష్ కు కొత్త కాదు. దశాబ్దాలుగా ఇలాంటి పాత్రలు పోషించాడు. కానీ పెళ్లీడుకొచ్చిన ఓ కూతురికి తండ్రిగా మాత్రం వెంకీ నటించలేదు. శ్రీకాంత్ అడ్డాల రాసుకున్న కథ అలాంటిదే. తండ్రికూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్ బాండింగ్ తో, గోదావరి నేపథ్యంలో ఈ స్టోరీ రాసుకున్నాడు అడ్డాల.

ముందుగా ఈ స్టోరీని బాలకృష్ణతో కలిసి పట్టాలపైకి తీసుకురావాలని అనుకున్నాడు ఈ దర్శకుడు. కానీ వెంకటేష్ అయితే మరింత న్యాయం చేయగలడని భావించి దగ్గుబాటి కాంపౌండ్ లోకి ఎంటరయ్యాడు. అడ్డాలపై సురేష్ బాబుకు మంచి నమ్మకం ఉంది. దీంతో ఈ ప్రాజెక్టుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రస్తుతానికైతే ఈ కాంబినేషన్ పై ఇంతవరకు మాత్రమే అప్ డేట్స్ వచ్చాయి. వెంకీకి అడ్డాల ఫైనల్ నెరేషన్ ఇచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ బయటకు రాబోతున్నాయి. ప్రస్తుతం వెంకటేశ్, నెట్ ఫ్లిక్స్ కు ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

First Published:  19 July 2022 10:30 AM GMT
Next Story