Telugu Global
Cinema & Entertainment

Saindhav | రేపే సైంధవ్ ట్రయిలర్ రిలీజ్

Saindhav Trailer - వెంకీ కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ చిత్రం సైంధవ్. ఈ సినిమా ట్రయిలర్ ను రేపు రిలీజ్ చేయబోతున్నారు.

Saindhav | రేపే సైంధవ్ ట్రయిలర్ రిలీజ్
X

విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ మూవీ ‘సైంధవ్’ 2024లో విడుదలవుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో ఒకటి. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా మేకర్స్ ‘సైంధవ్‌’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ‘సైంధవ్‌’ ట్రైలర్ జనవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో వెంకటేష్, బేబీ సారా చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.

నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా లాంటి ప్రముఖ నటుల ఈ చిత్రంలో కీలక పాత్రలలో అలరించనున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

సెన్సేషనల్ కంపోజర్ సంతోష్ నారాయణన్ ‘సైంధవ్‌’ కు కంపోజర్ గా వర్క్ చేస్తున్నాడు.20సైంధవ్ జనవరి 13న అన్ని దక్షిణ భారత భాషలు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.

First Published:  2 Jan 2024 5:17 PM GMT
Next Story