Telugu Global
Cinema & Entertainment

Venkatesh | సైంధవ్ వచ్చేస్తున్నాడు

Venkatesh Saindhav - సంక్రాంతి కానుకగా వచ్చిన సైంధవ్ మూవీ ఇప్పుడు బుల్లితెర వీక్షకుల్ని అలరించడానికి ప్రయత్నిస్తోంది.

Venkatesh | సైంధవ్ వచ్చేస్తున్నాడు
X

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ చిత్రంగా తెరకెక్కింది సైంధవ్ మూవీ. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. శైలేష్ కొలను డైరక్ట్ చేసిన ఈ యాక్షన్ మూవీని ఆడియన్స్ ఆదరించలేదు. అలా నష్టాలతో ముగిసిన ఈ సినిమా, ఆ తర్వాత ఓటీటీలో ప్రత్యక్షమైంది.

ఇటు ఈటీవీ విన్ తో పాటు, అటు అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఓటీటీలో సైంధవ్ కు ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడీ సినిమా బుల్లితెర వీక్షకుల ముందుకు రాబోతోంది. సైంధవ్ టెలికాస్ట్ డేట్ లాక్ అయింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను ఈటీవీ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

మూవీని ఈనెల 17న ఈటీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయబోతోంది. థియేటర్లు, ఓటీటీలో ఆకట్టుకోని ఈ సినిమా టీవీ వీక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో వెంకీ సరసన శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా నటించింది. కీలక పాత్రల్లో రుహానీ శర్మ, ఆండ్రియా, ఆర్య కనిపించారు.

ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యాడు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఎన్నో లెక్కలేసి వెంకీ చేసిన ఈ సినిమా ఫెయిల్ అవ్వడంతో దగ్గుబాటి ఫ్యాన్స్ డీలా పడ్డారు.

First Published:  7 March 2024 5:25 PM GMT
Next Story