Telugu Global
Cinema & Entertainment

Venkatesh | సైంధవ్ ఫ్యామిలీ సినిమా అంటున్న వెంకీ

Venkatesh - సైంధవ్ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇది ఫ్యామిలీ మూవీ అంటున్నాడు వెంకటేశ్. సంక్రాంతికి కుటుంబ సమేతంగా థియేటర్లకు రమ్మంటున్నాడు.

Venkatesh | సైంధవ్ ఫ్యామిలీ సినిమా అంటున్న వెంకీ
X

విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ చిత్రం ‘సైంధవ్’ 2024లో విడుదలవుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో ఒకటి. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ‘సైంధవ్ టీజర్ కు నేషనల్ వైడ్ గా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ రోజు ‘సైంధవ్’ ఫస్ట్ సింగిల్ 'రాంగ్ యూసేజ్' ని సిఎంఆర్, విఎన్ఆర్ కాలేజీల్లో నిర్వహించిన ఈవెంట్స్ లో లాంచ్ చేసి మేకర్స్ చాలా గ్రాండ్ గా మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్స్ లో భారీగా హాజరైన విద్యార్ధులతో కలసి సందడి చేశారు విక్టరీ వెంకటేష్. రాంగ్ యూసేజ్ పాటకు వేదికపై వెంకటేష్ డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని, విద్యార్ధులని అలరించింది.

సెన్సేషనల్ కంపోజర్ సంతోష్ నారాయణన్ ఈ పాట కోసం ఎక్స్ ట్రార్డినరీ క్యాచి నెంబర్ కంపోజ్ చేశారు. నకాష్ అజీజ్ తన ఎనర్జిటిక్ వోకల్స్ తో ఆకట్టుకున్నారు. ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ రాసిన లిరిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డబ్బు, ప్రేమ, మనుషులు గురించి రాసిన అర్ధవంతమైన సాహిత్యం ఆడియన్స్ ని అలరించింది. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకటేశ్, సైంధవ్ సినిమా ఫ్యామిలీ మూవీ అంటున్నాడు.

"సైంధవ్ నా 75వ చిత్రం. చాలా ప్రత్యేకమైనది. నా మనసుకు దగ్గరైన చిత్రం. నిర్మాత వెంకట్ గారు చాలా గ్రాండ్ నిర్మించారు. దర్శకుడు శైలేష్ అద్భుతంగా తెరకెక్కించారు. తనతో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. సంతోష్ నారాయణ్, డీవోపీ మణికందన్ బ్రిలియంట్ వర్క్ ఇచ్చారు. ఈ సినిమా ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. యాక్షన్ చాలా న్యూ ఏజ్ గా వుంటుంది. యాక్షన్ ఎమోషన్ చాలా ఎక్స్ ట్రార్డినరీగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. జనవరి 13నసినిమా విడుదలౌతుంది. తప్పకుండా సినిమాని ఆదరిస్తారనే నమ్మకం ఉంది"

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 13న అన్ని దక్షిణ భారత భాషలతో పాటు హిందీలో విడుదల కానుంది.

First Published:  21 Nov 2023 5:12 PM GMT
Next Story