Telugu Global
Cinema & Entertainment

అనుదీప్ దర్శకత్వంలో వెంకటేష్

జాతిరత్నాలు సినిమాతో దర్శకుడిగా పాపులర్ అయ్యాడు అనుదీప్. ఇప్పుడీ దర్శకుడు ఏకంగా వెంకటేష్ ను డైరక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. త్వరలోనే వెంకీకి నెరేషన్ ఇస్తానంటున్నాడు అనుదీప్. ఇంతకీ ప్రాజెక్టు సెట్ అవుతుందా?

అనుదీప్ దర్శకత్వంలో వెంకటేష్
X

జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ లో ఫేమస్ అయిపోయాడు దర్శకుడు అనుదీప్. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఏకంగా శివకార్తికేయన్ ను డైరక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ప్రిన్స్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పుడీ దర్శకుడు మరో బంపర్ ఆఫర్ అందుకున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే సీనియర్ హీరో వెంకటేష్ ను డైరక్ట్ చేయబోతున్నాడు అనుదీప్ కెవి

ప్రస్తుతం ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమాకు ప్రచారం కల్పిస్తున్నాడు అనుదీప్. ఈ సినిమాకు కథ-స్క్రీన్ ప్లే అందించాడు ఈ దర్శకుడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా వెంకటేశ్ కోసం కథ రెడీ చేసిన విషయాన్ని బయటపెట్టాడు. త్వరలోనే వెంకటేష్ ను కలిసి నెరేషన్ ఇస్తానని ప్రకటించాడు. వీళ్లిద్దరి కాంబోలో పక్కా కామెడీ సినిమా రాబోతోందనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

జాతిరత్నాలతో అనుదీప్ కామెడీ ఎలా ఉంటుందో అందరం చూశాం. ఇక వెంకీ కామెడీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కెమెడీ చేస్తే తిరుగుండదు. ఇలా కామెడీకి కేరాఫ్ అయిన దర్శకుడు, హీరో కలిస్తే.. ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే వెంకీ దగ్గర నెరేషన్ అంత ఈజీ కాదు.

వెంకీతో సినిమా చేయాలంటే ముందుగా సురేష్ బాబుకు కథ వినిపించాలి. ఆయనకు కథ నచ్చాలి. ఆ తర్వాత ఆయన చెప్పిన మార్పులు చేయాలి. అప్పుడు వెంకీకి ఫైనల్ నెరేషన్ ఇవ్వాలి. ఇంత తతంగం ఉందక్కడ. మరి వెంకీని, అనుదీప్ తన కథతో మెప్పిస్తాడో లేదో చూడాలి.

అన్నట్టు ఈ దర్శకుడు కూడా ఇప్పుడు ఖాళీగా లేడు. మరో మూడేళ్ల వరకు వరుసపెట్టి సినిమాలున్నాయని ప్రకటించాడు అనుదీప్. అందుకే ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా కూడా చేయలేకపోయానని వెల్లడించాడు. సో.. కథ ఓకే అయినా వెంకీ-అనుదీప్ కాంబోలో సినిమా రావాలంటే చాన్నాళ్లు ఆగక తప్పదన్నమాట.




First Published:  29 Aug 2022 11:06 AM GMT
Next Story