Telugu Global
Cinema & Entertainment

దేవుడిగా మారిన విక్టరీ వెంకటేష్

అనుమానాలకు చెక్ పడింది, రూమర్లకు తెరపడింది, ఊహాగానాలు తేలిపోయాయి. వెంకటేష్ దేవుడిగా పాత్రలో కనిపించబోతున్నాడు. వివరాల కోసం చదవండి..

దేవుడిగా మారిన విక్టరీ వెంకటేష్
X

విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం 'ఓరి దేవుడా'. ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. దీనికి కారణం ఇందులో విక్టరీ వెంకటేష్ కూడా ఉన్నాడనే ప్రచారం. ఈ చిత్రంలో వెంక‌టేష్ దేవుడి క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్నారంటూ వార్త‌లు వినిపించాయి. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ ఇన్నాళ్లకు ధృవీకరించారు. సినిమాలో వెంకీ దేవుడే. ఈ మేరకు స్ట‌న్నింగ్ గ్లింప్స్‌తో అధికారికంగా ధృవీక‌రించారు.

ఈ ప్ర‌క‌ట‌న అంద‌రిలోనూ ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచింది. గ్లింప్స్‌ను గ‌మ‌నిస్తే.. వెంక‌టేష్ కూల్‌, స్టైలిష్ లుక్ లో దేవుడు క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నార‌ని అర్థ‌మ‌వుతుంది. చుట్టూ పుస్త‌కాలు.. సీతాకోక చిలుక‌లు మ‌ధ్య విశ్వ‌క్ సేన్ క‌నిపించాడు. విక్ట‌రీ వెంక‌టేష్ అంటే ఓ మేన‌రిజ‌మ్ ఉంటుంది. ఆ మేన‌రిజ‌మ్‌తో ఆయ‌న ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కుల‌కు గ్లింప్స్ చివ‌ర‌లో స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు.

ఓరి దేవుడా చిత్రం షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయ‌టం డ‌బుల్ స‌ర్‌ప్రైజ్. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 21న విడుద‌ల చేస్తున్నారు. పివిపి సినిమా బ్యాన‌ర్స్‌పై ప్ర‌సాద్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


రీసెంట్ గా ఒకే ఒక జీవితం సినిమాకు డైలాగ్స్ రాసిన దర్శకుడు తరుణ్ భాస్కర్, ఈ సినిమాకు కూడా డైలాగ్స్ అందిస్తున్నాడు.



First Published:  21 Sep 2022 2:47 PM GMT
Next Story