Telugu Global
Cinema & Entertainment

Venkatesh | బ్లాక్ బస్టర్ కాంబో కలిసింది

Venkatesh - అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు వెంకీ. దిల్ రాజు నిర్మాత. ఈరోజు మూవీని అఫీషియల్ గా ప్రకటించారు.

Venkatesh | బ్లాక్ బస్టర్ కాంబో కలిసింది
X

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి 2 హిలేరియస్ హిట్‌లు ఎఫ్2, ఎఫ్3 అందించారు. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం మళ్లీ చేతులు కలిపారు.. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఉగాది సందర్భంగా ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు.

ఇప్పటివరకు బ్యాక్ టు బ్యాక్ 7 బ్లాక్‌బస్టర్‌లను అందించాడు. ఇప్పుడు ఆరోసారి దిల్ రాజుతో కలిసి సినిమా చేస్తున్నాడు. దిల్ రాజుకు ఇది 58వ సినిమా. ఓ వీడియో రిలీజ్ చేసి, ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఈ కొత్త చిత్రం ఒక ఎక్స్ ట్రార్డినరీ ట్రై యాంగిలర్ క్రైమ్ ఎంటర్‌టైనర్, ఇది మూడు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంది- హీరో, అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అతని ఎక్స్ లెంట్ వైఫ్. థీమ్ చాలా క్రేజీ అనిపిస్తుంది. మునుపెన్నడూ లేని ఎంటర్ టైన్మెంట్ కు గ్యారెంటీ ఇస్తోంది.

ఈ ముగ్గురూ ఇప్పటికే రెండు బ్లాక్‌బస్టర్‌లను అందించిన నేపథ్యంలో వీరి కాంబినేషన్‌లో మరో సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ధమాకా కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

First Published:  9 April 2024 5:18 PM GMT
Next Story