Telugu Global
Cinema & Entertainment

Veera Simha Reddy Box Office Collections: బాలయ్య సినిమా 2 రోజుల వసూళ్లు

Veera Simha Reddy Box Office Collections: బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహా రెడ్డి మూవీ రెండో రోజు పూర్తిగా పడిపోయింది

Veera Simha Reddy Movie Twitter Review: వీర సింహా రెడ్డి మూవీ ట్విట్టర్ రివ్యూ
X

Veera Simha Reddy Movie Twitter Review: వీర సింహా రెడ్డి మూవీ ట్విట్టర్ రివ్యూ

బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా వీరసింహారెడ్డి. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు దుమ్ముదులిపింది. కానీ రెండో రోజు ఈ సినిమాకు భారీగా వసూళ్లు తగ్గిపోయాయి. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో కలిసి స్క్రీన్స్ షేర్ చేసుకోవాల్సి రావడంతో, బాలయ్య సినిమాకు వసూళ్లు పడిపోయాయి.


అందరూ ఆశ్చర్యపోయే రేంజ్ లో వీరసింహారెడ్డి సినిమాకు రెండో రోజు వసూళ్లు పడిపోయాయి. మొదటి రోజు ఈ సినిమాకు 25 కోట్ల రూపాయలకు పైగా షేర్ రాగా, రెండో రోజు ఆ షేర్ విలువ అమాంతం 5 కోట్లకు పడిపోయింది. బాలయ్య సినిమాకు భారీగా థియేటర్లు తగ్గడం వల్ల ఇలా జరిగిందా లేక కంటెంట్ రొటీన్ గా ఉండడం వల్ల ఇలా జరిగిందా అనే విషయాన్ని ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ట్రేడ్ అంచనా ప్రకారం, ఈ రెండూ కారణమై ఉండొచ్చు.


వరల్డ్ వైడ్ ఈ సినిమాను 73 కోట్ల రూపాయలకు అమ్మారు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 74 కోట్ల రూపాయలు రావాలి. సో.. ఈ సినిమాకు ఇంకా 36కోట్ల రూపాయలకు పైగా కావాలి. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా అవ్వదా అనే అనుమానం కలుగుతోంది.


ఇక 2 రోజుల వసూళ్ల విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఇంతకుముందే చెప్పుకున్నట్టు రెండు రోజుల్లో 5 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. నైజాం (7.72 కోట్లు షేర్), సీడెడ్ (8.40 కోట్లు షేర్) నుంచి ఈ సినిమాకు ఎక్కువ షేర్లు వస్తున్నాయి.

First Published:  14 Jan 2023 10:58 AM GMT
Next Story