Telugu Global
Cinema & Entertainment

Veera Simha Reddy: ఘనంగా వంద రోజుల పండగ

Veera Simha Reddy 100 Days function: వీరసింహారెడ్డి వంద రోజుల పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. అందరికీ షీల్డులు అందించారు.

Veera Simha Reddy: ఘనంగా వంద రోజుల పండగ
X

Veera Simha Reddy: ఘనంగా వంద రోజుల పండగ

నటసింహ నందమూరి బాలకృష్ణ 107వ చిత్రం 'వీర సింహారెడ్డి 100 రోజులు పూర్తి చేసుకుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి బయ్యర్లందరికీ లాభాలను అందించింది.

బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 'వీరసింహారెడ్డి' 100 రోజుల వేడుకను ఘనంగా నిర్వహించారు. యూనిట్ కు 100 రోజుల షీల్డ్‌లను అందించారు. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా షీల్డ్‌లు అందించారు.

చిత్ర యూనిట్ తో పాటు అనిల్ రావిపూడి, బాబీ, హరీష్ శంకర్, శివ నిర్వాణ, బుచ్చిబాబు, సితార నాగవంశీ, సాహు గారపాటి, హరీష్ పెద్ది తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. భారీ సంఖ్యలో నందమూరి అభిమానులు హాజరయ్యారు.

భారీ కాంపిటిషన్ మధ్య సంక్రాంతి బరిలో విడుదలైంది వీరసింహారెడ్డి సినిమా. ఓవైపు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా, మరోవైపు దిల్ రాజు తీసిన వారసుడు సినిమా బరిలో ఉన్నప్పటికీ తన మార్క్ చాటుకుంది. ఈ సినిమాతో తన సంక్రాంతి సెంటిమెంట్ ను మరోసారి నిలుపుకున్నాడు బాలయ్య.

First Published:  11 Jun 2023 11:26 AM GMT
Next Story