Telugu Global
Cinema & Entertainment

Veeranjaneyulu Vihara Yatra: నరేష్ లీడ్ రోల్ లో మరో కామెడీ చిత్రం

Veeranjaneyulu Vihara Yatra Trailer: సీనియర్ నటుడు నరేష్ నటించిన మూవీ వీరాంజనేయులు విహారయాత్ర. ఈ వెబ్ మూవీ ట్రయిలర్ రిలీజైంది.

Veeranjaneyulu Vihara Yatra: నరేష్ లీడ్ రోల్ లో మరో కామెడీ చిత్రం
X

సీనియర్ నరేశ్, రాగ్‌ మయూర్‌, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ లో నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వీరాంజనేయులు విహారయాత్ర’. అనురాగ్‌ పలుట్ల దర్శకత్వం వహించారు. బాపినీడు.బి, సుధీర్‌ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఆగస్ట్ 14న ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీం కాబోతోంది. ఇటివలే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. హీరోలు వెంకటేష్, శ్రీవిష్ణు, సందీప్ కిషన్, డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో ట్రైలర్ ని లాంచ్ చేశారు.

ప్రియాతిప్రియమైన కుటుంబ సభ్యులకు మీ వీరాంజనేయులు ప్రేమతో రాయునది. ఆఖరి కోరికగా కుటుంబం అంతా గోవాలో నా ఆస్తికలు కలుపుతారని నమ్ముతున్నాను’ అంటూ వీరాంజనేయులు అస్థికల చెంబుకు బ్రహ్మానందం చెప్పిన వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

ఫ్యామిలీ ఎలిమెంట్స్, కథలోని ఎమోషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫ్యామిలీ కలిసి చూసే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ అనురాగ్ ఈ చిత్రాన్ని మలిచారని ట్రైలర్ చుస్తే అర్ధమౌతోంది.

First Published:  8 Aug 2024 5:45 PM GMT
Next Story