Telugu Global
Cinema & Entertainment

Veera Simha Reddy Movie: వీరసింహారెడ్డి షూటింగ్ ఎంతవరకు వచ్చింది?

Veera Simha Reddy Movie: బాలకృష్ణ, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది.

Veera Simha Reddy Movie: వీరసింహారెడ్డి షూటింగ్ ఎంతవరకు వచ్చింది?
X

వీరసింహారెడ్డి

Veera Simha Reddy Movie: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ వీరసింహారెడ్డి. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ ను ఆవిష్కరించారు. అదే సందర్భంలో సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఆ హంగామా ముగియడంతో, ఇప్పుడీ సినిమా కొత్త షెడ్యూల్ పనిలో పడ్డారు.

ప్రస్తుతం బాలకృష్ణ, విలన్ బ్యాచ్‌ పై భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. కథలో కీలకమైన సమయంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ వస్తందని చెబుతున్నాడు దర్శకుడు. ఫైట్ మాస్టర్ వెంకట్ ఫైట్ సీక్వెన్స్‌ని పర్యవేక్షిస్తున్నాడు.

ఈ చిత్రం కథ యదార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ ఎత్తున రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సంగీత సంచలనం థమన్ ఈ చిత్రానికిసంగీతం అందిస్తున్నాడు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. వీరసింహారెడ్డి 2023 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

First Published:  28 Oct 2022 3:32 AM GMT
Next Story