Telugu Global
Cinema & Entertainment

Varun Tej | మరో సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మెగా హీరో

Varun Tej's New Movie - సోనీ పిక్చర్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. డిసెంబర్ లో ఇది రిలీజ్ అవుతుంది.

Varun Tej | మరో సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మెగా హీరో
X

వరుణ్ తేజ్ గత కొన్ని రోజులుగా అన్నపూర్ణ స్టుడియోస్ లో ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ లో పాల్గొన్నాడు. తాజాగా ఈ మూడో షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేకర్స్ రివీల్ చేసిన పోస్టర్‌లో వరుణ్ తేజ్, యుద్ధ విమానం ముందు నిలబడి ఉన్న ఎయిర్ ఫోర్స్ అధికారిగా కనిపించారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ కలిసి రూపొందిస్తున్న ఈ యాక్షన్ డ్రామా టైటిల్‌ను త్వరలో అనౌన్స్ చేస్తారు. తాజాగా విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

దీంతో వరుణ్ తేజ్ 2 సినిమాల రిలీజ్ డేట్స్ పై క్లారిటీ వచ్చేసింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున సినిమా చేస్తున్నాడు వరుణ్. ఈ మూవీని ఆగస్ట్ 25న విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇక సోనీ పిక్చర్స్ బ్యానర్ పై శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా డిసెంబర్ లో రిలీజ్ కాబోతోంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ రెండు సినిమాల్ని వీలైనంత తొందరగా పూర్తిచేసి, పెళ్లికి సిద్ధమౌతున్నాడు వరుణ్. లావణ్య త్రిపాఠిని ఇతడు త్వరలోనే పెళ్లాడనున్నాడు. పెళ్లి తర్వాత కేవలం ఈ 2 సినిమాల ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తాడు.

First Published:  5 July 2023 4:21 AM GMT
Next Story