Telugu Global
Cinema & Entertainment

Varun Tej: వరుణ్ తేజ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్

Varun Tej New Movie Title - వరుణ్ తేజ్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

Varun Tej: వరుణ్ తేజ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్
X

డిఫరెంట్ కాన్సెప్టులు సెలక్ట్ చేసుకుంటున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఇప్పుడీ హీరో, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి తాజాగా టైటిల్ ఫిక్స్ చేశారు. దీనికి ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. వరుణ్ తేజ్ కెరీర్ లో 12వ చిత్రమిది.

గాండీవధారి అర్జున సినిమా షూటింగ్ గ‌తేడాది అక్టోబ‌ర్‌లో ప్రారంభ‌మైంది. వ‌రుణ్ తేజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌, ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

మోష‌న్ పోస్ట‌ర్‌ను గ‌మనిస్తే మాస్క్ ధ‌రించిన మ‌నుషులు కొంద‌రు ఓ రాజ భ‌వ‌నంలోనికి ప్ర‌వేశించ‌టానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. అలాంటి సంద‌ర్భంలో బాంబుల మోత‌, గ‌న్ ఫైరింగ్ న‌డుమ వ‌రుణ్ తేజ్ యాక్ష‌న్ మోడ్‌లో క‌నిపిస్తున్నాడు. ఈ మోష‌న్ పోస్ట‌ర్ గ్లింప్స్‌లోనే ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ను రివీల్ చేశారు.

మిక్కి జె.మేయ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఆయ‌న అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై సీనియర్ నిర్మాత బి.వి.ఎస్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.Next Story