Telugu Global
Cinema & Entertainment

Varun Tej - కొత్త సినిమాకు రిలీజ్ డేట్ లాక్ చేసిన వరుణ్ తేజ్

Varun Tej - వరుణ్ తేజ్ కొత్త సినిమాకు రిలీజ్ డేట్ లాక్ అయింది. సినిమా పేరు గాండీవధారి అర్జున.

Varun Tej - కొత్త సినిమాకు రిలీజ్ డేట్ లాక్ చేసిన వరుణ్ తేజ్
X

కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో వరుణ్ తేజ్. ఇప్పుడీ హీరో మరో డిఫరెంట్ ఫిలిం చేశాడు. దాని పేరు ‘గాంఢీవధారి అర్జున’. స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ ప‌క్కా యాక్ష‌న్ మోడ్‌లో కనిపిస్తున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తుంది.

వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా.. యూరోపియ‌న్ దేశాల‌తో పాటు అమెరికాలోనూ షూటింగ్‌ జరుపుకుంది ఈ సినిమా. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్ట్ 25న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

‘గాంఢీవధారి అర్జున’ షూటింగ్ పూర్త‌యిన విష‌యాన్ని తెలియ‌జేస్తూ మేకర్స్ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో వ‌రుణ్ తేజ్ చాలా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. చేతిలో గ‌న్ ప‌ట్టుకుని నిలుచుని ఉన్నాడు. వ‌రుణ్‌తేజ్ ఈ చిత్రంలో సెక్యూరిటీ ఆఫీస‌ర్‌గా కనిపించబోతున్నాడు. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్థితుల నుంచి ప్ర‌జ‌లను అత‌ను ఎలా కాపాడాడు, అత‌ని స్ట్రాట‌జీస్ ఏంటనేది సినిమా స్టోరీ.

మిక్కీ జె.మేయ‌ర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు, శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ బ్యానర్ పై ఓ యాక్షన్ ఎఁటర్ టైనర్ చేస్తున్నాడు వరుణ్ తేజ్. దీనికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. త్వరలోనే ఆ టైటిల్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాల్ని కొలిక్కి తీసుకొచ్చి, లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్నాడు వరుణ్ తేజ్.

First Published:  28 Jun 2023 12:33 PM GMT
Next Story