Telugu Global
Cinema & Entertainment

Varun Tej - వరుణ్ తేజ్ కొత్త సినిమా అప్ డేట్స్

Varun Tej new movie - ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో కొత్త సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ మూవీ షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం

Varun Tej - వరుణ్ తేజ్ కొత్త సినిమా అప్ డేట్స్
X

యదార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు వరుణ్ తేజ్. కెరీర్ లో అతడికిది 13వ చిత్రం. యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్, శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

తెలుగు-హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి వరుణ్ తేజ్ పాత్రను భారతీయ వైమానిక దళ పైలట్‌గా పరిచయం చేసిన వీడియో అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. ఈ సినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ హీరోయిన్. రాడార్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనుంది.

తాజాగా ఈ సినిమా గ్వాలియర్ షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా కనిపించే ఫోటోను విడుదల చేశారు.

ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రం దేశభక్తితో కూడుకున్న ఎడ్జ్ అఫ్ సీట్ థ్రిల్లర్ గా రానుంది. భీకర వైమానిక దాడుల్లో మన వీరుల పోరాటాన్ని, వారు ఎదుర్కొనే సవాళ్లను చూపుతుంది.

శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్ , సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ పై సందీప్ ముద్దా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

First Published:  8 April 2023 12:45 PM GMT
Next Story