Telugu Global
Cinema & Entertainment

Varun Tej - మరో సినిమా పూర్తి చేసిన వరుణ్ తేజ్

Varun Tej - మరికొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకున్న వరుణ్ తేజ్, తన సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. ఆపరేషన్ వాలంటైన్ షూటింగ్ కంప్లీట్ అయింది.

Varun Tej - మరో సినిమా పూర్తి చేసిన వరుణ్ తేజ్
X

తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్' తో హిందీలో అరంగేట్రం చేస్తున్నాడు వరుణ్ తేజ్. యదార్ధ సంఘటన స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించనున్నాడు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. "ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ పూర్తి" అని రాసి ఉన్న పోస్టర్‌ ని మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ లో టీమ్ మొత్తం ఆనందంగా కనిపిస్తోంది.

మానుషి చిల్లర్ ఈ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమౌతోంది. ఇందులో ఆమె రాడార్ ఆఫీసర్ పాత్రను పోషించింది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన నవదీప్‌ని కూడా పోస్టర్ లో చూడవచ్చు. ఆపరేషన్ వాలెంటైన్ డిసెంబర్ 8న తెలుగు, హిందీలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

భారతదేశం ఎన్నడూ చూడని అతిపెద్ద వైమానిక దాడుల్లో మన వైమానిక దళం హీరోలు, వారు ఎదుర్కొన్న సవాళ్లను చూపిస్తూ ఈ చిత్రం తెరకెక్కుతోంది. షూటింగ్ పూర్తవ్వడంతో, పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగం పుంజుకున్నాయి.

2022లో విడుదలైన ‘మేజర్’భారీ విజయం తర్వాత సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులముందుకొస్తోంది. ఇది కూడా దేశభక్తి కథ కావడం విశేషం. అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

First Published:  20 Oct 2023 4:54 PM GMT
Next Story