Telugu Global
Cinema & Entertainment

Varun Sandesh - షూటింగ్ లో గాయపడ్డ వరుణ్ సందేశ్

Varun Sandesh met - వరుణ్ సందేశ్ గాయపడ్డాడు. తన కొత్త సినిమా షూటింగ్ లో అతడికి గాయాలయ్యాయి.

Varun Sandesh - షూటింగ్ లో గాయపడ్డ వరుణ్ సందేశ్
X

వరుణ్ సందేశ్ హీరోగా 'జాగృతి మూవీ మేకర్' బ్యానర్ పై నిర్మాణం అవుతున్న చిత్రం 'కానిస్టేబుల్' నిన్న చిత్రానికి సంబంధించిన ఫైటింగ్ సీన్ షూటింగ్ సమయంలో హీరో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయం అయింది. డాక్టర్లు వరుణ్ ని మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. దీంతో కానిస్టేబుల్ సినిమా షూటింగ్ అర్థాంతరంగా వాయిదా వేయాల్సి వచ్చింది.

ఈ సినిమాకు ఆర్యన్ శుభాన్ దర్శకుడు. పూర్తిగా పల్లెటూరి వాతావరణం లో నిర్మాణం అవుతున్న ఈ చిత్రం ఒక కానిస్టేబుల్ జీవిత కథ చుట్టూ తిరుగుతుంది. సినిమా షూటింగ్ 40శాతం పూర్తయింది. ఇదే ఊపులో షూటింగ్ ను కొనసాగించాలనుకున్నారు. అంతలోనే ఇలా వరుణ్ సందేశ్ ప్రమాదానికి గురయ్యాడు.

వరుణ్ తేజ్ కోలుకున్న తర్వాత ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ మొదలవుతుంది. బలగం జగదీశ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

క్యారెక్టర్ బాగుంటే తను ఎంత రిస్క్ అయినా తీసుకుంటానంటూ ఈమధ్యే ప్రకటించాడు వరుణ్ తేజ్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మంచి పాత్రలు చేయాలని ఉందని, లవర్ బాయ్ ఇమేజ్ నుంచి మంచి నటుడు అనిపించుకోవడమే తన లక్ష్యమని, దాని కోసం ఎంతైనా కష్టపడతానంటూ తాజాగా ప్రకటించాడు. అంతలోనే ఇలా ప్రమాదం బారిన పడ్డాడు.

First Published:  21 Jun 2023 3:01 PM GMT
Next Story