Telugu Global
Cinema & Entertainment

తెలుగు తెరపైకి మరో హిందీ సినిమా

తెలుగు మార్కెట్ పై బాలీవుడ్ కన్నుపడింది. రిలీజ్ ల సంఖ్య పెరిగింది. తాజాగా వరుణ్ ధావన్ సినిమా కూడా తెలుగులోకి వస్తోంది.

తెలుగు తెరపైకి మరో హిందీ సినిమా
X

బాలీవుడ్ మార్కెట్ పూర్తిగా డల్ అయింది. పెద్ద పెద్ద సినిమాలే బొక్కబోర్తాపడుతున్నాయి. అదే టైమ్ లో సౌత్ సినిమా ఇండస్ట్రీ ఊపందుకుంది. దీంతో హిందీ మేకర్స్ అంతా సౌత్ పై పడ్డారు. ఇప్పటికే బ్రహ్మాస్త్ర సినిమాను తెలుగులో భారీ ఎత్తున విడుదల చేశారు. ఇప్పుడీ బాటలో మరో సినిమా కూడా వస్తోంది.

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కొత్త సినిమా బేడియా. హిందీ తెలుగు తమిళ భాషల్లో నవంబర్ 25న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగులో ఈ మూవీకి తోడేలు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాతో సౌత్ మార్కెట్ లో నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు వరుణ్ ధావన్.

తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ చేశారు. సర్ ప్రైజింగ్ హారర్ కామెడీ ఎలిమెంట్స్ తో సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇండియన్ స్క్రీన్ మీద తొలి క్రియేచర్ కామెడీ జానర్ మూవీగా బేడియాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అమర్ కౌశిక్. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

జియో స్టూడియోస్ సమర్పణలో మ్యాడాక్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అరుణాచల్ అడవుల నేపథ్యంగా బేడియా కథ సాగుతుంది. ఇక్కడి వైల్డ్ యానిమల్ గాయపర్చిన తర్వాత హీరో భాస్కర్ ప్రవర్తనలో అనూహ్య మార్పులు వస్తాయి. అతను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకునేందుకు అతని స్నేహితులు ప్రయత్నిస్తుంటారు. అతని వైల్డ్ బిహేవియర్ కు కారణాలేంటో తెలుసుకునే క్రమం అంతా ఆసక్తికర అంశాలతో సర్ ప్రైజింగ్ గా సాగుతుంది.



First Published:  20 Oct 2022 4:28 AM GMT
Next Story