Telugu Global
Cinema & Entertainment

Varsha Bollamma | నితిన్ సరసన వర్ష బొల్లమ్మ

Varsha Bollamma - నితిన్ కొత్త సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది వర్ష బొల్లమ్మ. ఆల్రెడీ సెట్స్ పైకి కూడా వచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Varsha Bollamma | నితిన్ సరసన వర్ష బొల్లమ్మ
X

నితిన్ తాజా చిత్రం తమ్ముడు. దిల్ రాజు బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా లాంఛనంగా మొదలైన సంగతి తెలిసిందే. ఆగస్ట్ లో ప్రారంభమైన ఈ సినిమా, సెప్టెంబర్ 1 నుంచి రెగ్యులర్ షెడ్యూల్ లోకి వచ్చింది. ఇప్పుడీ ప్రాజెక్టులోకి హీరోయిన్ వర్ష బొల్లమ్మ వచ్చి చేరింది.

మిడిల్ క్లాస్ మెలొడీస్, స్వాతిముత్యం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వర్ష బొల్లమ్మ.. నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో ఎంటరైంది. అయితే ఈమె హీరోయిన్ కాదు. ఓ కీలక పాత్ర కోసం వర్షను తీసుకున్నారు. సినిమాను మలుపుతిప్పే క్యారెక్టర్ అవ్వడంతో, వర్ష కూడా నటించడానికి అంగీకరించింది.

మొదటి షెడ్యూల్ లోనే నితిన్-వర్ష మధ్య కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ సీన్స్ తీశారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే రాజమండ్రి, ఢిల్లీలో తదుపరి షెడ్యూల్స్ మొదలవుతాయి. ఈ సినిమాలో చిన్నపాటి స్పోర్ట్స్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

కాంతార సినిమాతో అందర్నీ ఎట్రాక్ట్ చేసిన సప్తమి గౌడను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ అమ్మాయితో పాటు, వర్ష బొల్లమ్మ ఎంట్రీని త్వరలోనే ప్రకటిస్తారు. దీంతోపాటు తమ్ముడు టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేయడానికి రెడీగా ఉన్నారు.

First Published:  21 Sep 2023 12:14 PM GMT
Next Story