Telugu Global
Cinema & Entertainment

Yashoda Movie: యశోదలో నేను సెకెండ్ హీరోయిన్

Yashoda Movie: యశోదలో సమంత లీడ్ రోల్ పోషించింది. అయితే తన పాత్ర కూడా సమంత అంత పెద్దది అంటోంది వరలక్ష్మి. ఆ సంగతేంటో చూద్దాం...

వరలక్ష్మి శరత్ కుమార్
X

వరలక్ష్మి శరత్ కుమార్

సమంత లీడ్ రోల్ పోషించిన సినిమా యశోద. ఈ సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. సమంత తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న పాత్రను తను పోషించానంటోంది వరలక్ష్మి శరత్ కుమార్. సినిమాలో తనది సెకెండ్ లీడ్ అంటోంది. పైగా గ్రే షేడ్స్ కూడా ఉంటాయని చెబుతోంది.

"సమంతతో పాటు నా క్యారెక్టర్ కూడా ప్యారలల్ గా ఉంటుంది. సినిమాలో లీడ్ రోల్ సమంత చేశారు. ఆమెకు ఒకరు అవసరం అవుతారు. అప్పుడు నా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. రెండు కథలు జరుగుతాయి. ఆ రెండూ ఎలా కలిశాయనేది సినిమా. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. నాది సెకండ్ లీడ్ అని చెప్పవచ్చు. ఇంత కంటే ఎక్కువ చెబితే స్టోరీ రివీల్ అవుతుంది. ప్రతి ఒక్కరిలో మంచి చెడులు చూపించారు."

నవంబర్ 11న థియేటర్లలోకి వస్తోంది యశోద సినిమా. ఇందులో సరోగసి తల్లి పాత్ర పోషించింది సమంత. ఆమె ఫైట్స్ కూడా చేసింది. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాతో హరి-హరీష్ దర్శకులుగా పరిచయమౌతున్నారు.

First Published:  30 Oct 2022 11:11 AM GMT
Next Story