Telugu Global
Cinema & Entertainment

Sabari Movie: శబరి మూవీ షూటింగ్ అప్ డేట్స్

వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ పోషిస్తున్న సినిమా శబరి. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం...

Sabari Movie: శబరి మూవీ షూటింగ్ అప్ డేట్స్
X

టాలీవుడ్ హ్యాపెనింగ్ లేడీ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'శబరి'. తాజాగా మూడో షెడ్యూల్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. విశాఖలోని ఆర్కే బీచ్, సిరిపురం జంక్షన్‌తో పాటు అరకు లాంటి అందమైన లొకేషన్లలో షూటింగ్ చేశారు. అక్కడ ప్రధాన తారాగణంపై కొన్ని యాక్షన్ సీక్వెన్సులు, ఒక పాట, కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

నందు, నూర్ మాస్టర్స్ పర్యవేక్షణలో రూపొందిన ఈ యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని అంటోంది యూనిట్. నాలుగో షెడ్యూల్ ఈ నెలలో హైదరబాద్‌లో మొదలుకానుంది. ఈ షెడ్యూల్ తో టోటల్ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. నవంబర్ చివరి వారంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంపిక చేసుకునే చిత్రాలు భిన్నంగా ఉంటాయి. 'శబరి' కూడా అటువంటిదే. ఈ చిత్రంలో స్వతంత్ర భావాలున్న యువతిగా ఆమె కనిపించనుంది. యాక్షన్ ఎపిసోడ్స్ లో చాలా బాగా చేసిందంట.

ఇదొక యాక్షన్ థ్రిల్లర్. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అనీల్ కాట్జ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా.. కథ-మాటలు-స్క్రీన్ ప్లే కూడా చూసుకుంటున్నాడు.

First Published:  6 Nov 2022 4:37 AM GMT
Next Story