Telugu Global
Cinema & Entertainment

Waltair Veerayya: ప్రీ బుకింగ్ సేల్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న వాల్తేరు వీరయ్య

Waltair Veerayya Movie Records: వాల్తేరు వీరయ్య సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాను ఎక్కువ స్క్రీన్ లలో ప్రదర్శించేందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు సన్నాహాలు చేస్తున్నారు.

Waltair Veerayya: ప్రీ బుకింగ్ సేల్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న వాల్తేరు వీరయ్య
X

చాలా ఏళ్ల తర్వాత ఒక పక్కా మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. వాల్తేరు వీరయ్య పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తుండగా, శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్స్ తో ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత విధంగా చిరంజీవి సినిమాకు బజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టే ఈ మూవీ యూఎస్ఏ ప్రీ బుకింగ్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటిదాకా వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ బుకింగ్స్ సేల్స్ తోనే 100కే డాలర్స్ క్రాస్ చేసింది.

ఈ మూవీ విడుదలకు ఇంకా దాదాపు పది రోజుల సమయం ఉండటంతో .. ప్రీ బుకింగ్ సేల్స్ మరింతగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాను ఎక్కువ స్క్రీన్ లలో ప్రదర్శించేందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు సన్నాహాలు చేస్తున్నారు.

కాగా ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో హీరోగా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నాడు. ఆయన ఈ మూవీలో ఒక పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. దాదాపు 23 ఏళ్ల తర్వాత రవితేజ మరోసారి చిరంజీవి సినిమాలో నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. వాల్తేరు వీరయ్య సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

First Published:  4 Jan 2023 9:25 AM GMT
Next Story