Telugu Global
Cinema & Entertainment

Vaishnavi Chaitanya | మరో సినిమాకు సైన్ చేసిన 'బేబి' హీరోయిన్

Vaishnavi Chaitanya - బేబి సినిమాతో అదరగొట్టింది వైష్ణవి చైతన్య. ఇప్పుడీ ముద్దుగుమ్మకు మరో సినిమా ఆఫర్ వచ్చింది.

Vaishnavi Chaitanya | మరో సినిమాకు సైన్ చేసిన బేబి హీరోయిన్
X

దిల్ రాజు ప్రొడక్షన్స్.. బలగం లాంటి క్లాసిక్ వచ్చింది ఈ బ్యానర్ పై. అప్పట్నుంచి ఈ బ్యానర్ కు వెయిట్ పెరిగింది. మెయిన్ బ్యానర్ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎంత పాపులర్ అయిందో, ఒకే ఒక్క సినిమాతో దిల్ రాజు ప్రొడక్షన్స్ కూడా అంతే పాపులర్ అయింది. ఇప్పుడీ బ్యానర్ పై నటించే అవకాశం అందుకుంది హీరోయిన్ వైష్ణవి చైతన్య.

దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో ఆశిష్ హీరోగా అరుణ్ భీమవరపు దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా ‘బేబి’ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటించనుంది. ఈ మేరకు యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.

టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది వైష్ణవి చైతన్య. అయితే ఆమె హీరోయిన్ గా మారి చేసిన సినిమా బేబి. ఈ సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ తెలుగమ్మాయి. ఆ మూవీ తర్వాత దిల్ రాజు బ్యానర్ పై నటించే అవకాశం అందుకుంది. ఇది కూడా నటించడానికి మంచి స్కోప్ ఉన్న సినిమానే.

ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తుంటే, నేషనల్ అవార్డ్ విన్నర్ పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.

First Published:  29 Dec 2023 4:39 PM GMT
Next Story