Telugu Global
Cinema & Entertainment

Vaishnav Tej: సమ్మర్ కు షిఫ్ట్ అయిన మెగా హీరో

Vaishnav Tej: మెగా హీరో వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాతో రెడీ అవుతున్నాడు. సమ్మర్ లో థియేటర్లలోకి రాబోతున్నాడు.

Vaishnav Tej: సమ్మర్ కు షిఫ్ట్ అయిన మెగా హీరో
X

వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ రెడ్డి ఈ మూవీతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 29న ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. తీగల కంచె ఆవల అస్పష్టంగా కనిపిస్తూ హీరో నిలుచున్న తీరు, మరో వైపు కంచె తగలబడుతున్న వైనం, ఆసక్తిని రేకెత్తిస్తోంది.

నిజానికి ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇంకా షూటింగ్ పూర్తికాలేదు. అందుకే సమ్మర్ ఎట్రాక్షన్ గా డేట్ ప్రకటించి మరీ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇదొక మాస్-యాక్షన్ ఎంటర్ టైనర్.

ఇప్పటికే చిత్రం చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. సినిమా టైటిల్ తో పాటు, మరిన్ని వివరాల్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు. వైష్ణవ్ తేజ్ కెరీర్ ను డిసైడ్ చేసే సినిమా ఇది.




First Published:  3 Jan 2023 3:26 AM GMT
Next Story