Telugu Global
Cinema & Entertainment

Aadikeshava | ఆదికేశవ ట్రయిలర్ ఎలా ఉందంటే..?

Aadikeshava - వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ఆదికేశవ. ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది. ఎలా ఉందో చూద్దాం..

Aadikeshava | ఆదికేశవ ట్రయిలర్ ఎలా ఉందంటే..?
X

పంజా వైష్ణవ్ తేజ్.. తొలి సినిమాతోనే నటుడిగా తన సత్తా నిరూపించుకున్నాడు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్, పూర్తి మాస్ యాక్షన్ ఓరియెంటెడ్ యూత్ ఫుల్ చిత్రం 'ఆదికేశవ'తో రాబోతున్నాడు. ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'లో నటుడిగా తనదైన ముద్ర వేసిన శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈరోజు ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ చూస్తే యువ దర్శకుడు, యువ హీరో కలిసి మంచి రొమాన్స్, కామెడీతో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చేసినట్టు స్పష్టమవుతోంది. ఆకర్షణీయమైన కంటెంట్, విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉన్నాయి. ఆదికేశవ ట్రైలర్ లో వైష్ణవ్ తేజ్‌ పాత్ర చాలా డైనమిక్ గా కనిపిస్తుంది. హీరోయిన్ శ్రీలీలతో అతడి కెమిస్ట్రీ బాగుంది. ఇద్దరి మధ్య సన్నివేశాలు క్యూట్ గా ఉన్నాయి.

జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ స్వరపరిచిన 'సిత్తరాల సిత్రావతి', 'లీలమ్మో', 'హే బుజ్జి బంగారం' వంటి పాటలు మాస్ ను ఎట్రాక్ట్ చేశాయి. ఆ పాటలతో పాటు ఇప్పుడీ ట్రయిలర్ కూడా హిట్టవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

రాధిక వంటి సీనియర్ నటులు, మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణ దాస్ చేరికతో ఈ సినిమాకు వెయిట్ పెరిగింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా, ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది.

First Published:  20 Nov 2023 4:50 PM GMT
Next Story