Telugu Global
Cinema & Entertainment

Aadikeshava | వైష్ణవ్ తేజ్ సినిమాకు కొత్త రిలీజ్ డేట్

Aadikeshava Movie - వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ఆదికేశవ. ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. మరో తేదీ బయటకొచ్చింది.

Adikeshava | వాయిదాపడిన ఆదికేశవ
X

ఆదికేశవ సినిమాలో వైష్ణవ్ తేజ్, శ్రీ లీల

కెరీర్ లో తొలిసారి పంజా వైష్ణవ్ తేజ్‌నటిస్తున్న యాక్షన్ సినిమా ఆదికేశవ. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యారన్ పై ఈ సినిమా వస్తోంది. మొదటి సినిమా 'ఉప్పెన'తోనే సంచలన విజయాన్ని అందుకున్న ఈ హీరో, ఈసారి 'ఆదికేశవ'లో డిఫరెంట్ గెటప్, మేనరిజమ్స్ తో కనిపిస్తున్నాడు.

ఈ చిత్రానికి శ్రీకాంత్ రెడ్డి దర్శకుడు. రచయిత కూడా అతడే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, పంజా వైష్ణవ్ తేజ్‌ను మునుపెన్నడూ లేని విధంగా కొత్త అవతార్‌లో చూపించింది.

ఆదికేశవలో వైష్ణవ్ తేజ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో ఆమె పాత్ర పేరు చిత్ర. చలాకీ పిల్ల టైపు క్యారెక్టర్ ఇది. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ లో ఆమె అందం, చిలిపితనంతో ఆకట్టుకుంది. శ్రీలీలతో పాటు జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీని లాక్ చేశారు. నవంబర్ 10న ఆదికేశవ సినిమా థియేటర్లలోకి వస్తోంది. నిజానికి ఈ సినిమా ఈరోజే రిలీజ్ అవ్వాలి. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో జాప్యంతో పాటు, షూటింగ్ పెండింగ్ లో ఉండడం వల్ల విడుదలను వాయిదా వేశారు. ఇటీవ‌లే ఆదికేశ‌వ చిత్రీకరణ ప్యారిస్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది.




First Published:  18 Aug 2023 4:06 PM GMT
Next Story