Telugu Global
Cinema & Entertainment

AadiKeshava - వైష్ణవ్ తేజ్ సినిమా టైటిల్ ఇదే!

Vaishnav Tej as AadiKeshava - వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాకు టైటిల్ లాక్ అయింది. దీనికి ఆదికేశవ్ అనే పేరు పెట్టారు. గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.

AadiKeshava - వైష్ణవ్ తేజ్ సినిమా టైటిల్ ఇదే!
X

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ నిర్మాణ సంస్థలు కలిసి వైష్ణవ్ తేజ్ హీరోగా సినిమా చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎఁటర్ టైనర్ లో శ్రీలీల హీరోయిన్. పంజా వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో తొలి యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇదే.

పంజా వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో నాలుగో చిత్రంగా రూపొందుతోన్న ఈ యాక్షన్ మూవీకి 'ఆదికేశవ' అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా ప్రపంచాన్ని, అందులోని పాత్రలను పరిచయం చేస్తూ ఈరోజు చిత్ర బృందం గ్లింప్స్ రిలీజ్ చేసింది. వైష్ణవ్ తేజ్ ఇందులో యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు.

ఆదికేశవ గ్లింప్స్ లో పంజా వైష్ణవ్ తేజ్ మనకు రుద్రగా పరిచయం అయ్యాడు. ఒక చిన్న గ్రామంలో గూండాలు శివాలయాన్ని ఆక్రమించాలని చూస్తుండగా, రుద్ర వారిని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ గొడవ ఎక్కడికి దారి తీసింది?, ఆ తర్వాత ఏం జరిగింది? అనే ఆసక్తిని కలిగించేలా గ్లింప్స్ కట్ చేశారు.

ఈ సినిమాలో చిత్ర పాత్రలో శ్రీలీల నటిస్తుండగా, వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్ కనిపించనుంది. మలయాళీ నటుడు జోజు జార్జ్, ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు. ఇందులో ఆయన విలన్.0

శ్రీకాంత్ రెడ్డి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. జూలైలో సినిమాను విడుదల చేయబోతున్నారు.



First Published:  15 May 2023 1:45 PM GMT
Next Story