Telugu Global
Cinema & Entertainment

Nayakudu - వడివేలు నాయకుడు ట్రయిలర్ ఎలా ఉందంటే?

Vadivelu's Nayakudu Movie - వడివేలు, ఉదయనిధి స్టాలిన్ కలిసి చేసిన సినిమా నాయకుడు. ఈ మూవీ తెలుగు వెర్షన్ రెడీ అయింది. ఈరోజు ట్రయిలర్ కూడా రిలీజ్ చేశారు

Nayakudu - వడివేలు నాయకుడు ట్రయిలర్ ఎలా ఉందంటే?
X

తమిళంలో తాజాగా సంచలనం సృష్టించిన మామన్నన్ తెలుగులో నాయకుడు గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించినఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కి మారి సెల్వరాజ్ దర్శకుడు. మామన్నన్ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచి తెలుగు వెర్షన్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి 'నాయకుడు' ట్రైలర్ ని లాంచ్ చేశారు.

''నేను పాడుతున్న పాట ఒకే పాట అయ్యిండాలి. ఆ పాట నేను జీవితాంతం పాడుతూ ఉండాలి. నా పొట్ట నుంచి పేగులు తీసి దానితో వీణ చేసి దాన్ని వీధి వీధిన మీటుతున్నాను. నిజాన్ని వినే చెవుల్ని నేను వెదుకుతున్నాను'' అనే ఇంటెన్స్ వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

వడివేలు, ఉదయనిధి స్టాలిన్ కొండపై నిలబడి నగరాన్ని చూస్తుండగా, తుపాకీ పేల్చి ఫహద్ ఫాసిల్ పాత్ర పరిచయం అవుతుంది. వడివేలు, ఉదయనిధి ఒకవైపు, ఫహద్‌ మరోవైపు.. వీరి మధ్య పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతుందని ట్రైలర్ ఎస్టాబ్లిష్ చేసింది. వడివేలు, ఉదయనిధి స్టాలిన్, ఫహద్ ఫాసిల్ ల ఫెర్ ఫార్మెన్స్ ఎక్స్ టార్దినరిగా ఉంది. కీర్తి సురేష్ కీలక పాత్రలో ఆకట్టుకుంది.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. తెలుగులో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం జూలై 14న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది.



First Published:  7 July 2023 5:01 PM GMT
Next Story