Telugu Global
Cinema & Entertainment

క్లయిమాక్స్ కు చేరుకున్న వారసుడు

విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా వారసుడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

క్లయిమాక్స్ కు చేరుకున్న వారసుడు
X

విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'వారసుడు'. ఇప్పటికే విడుదలైన వారసుడు ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాడు విజయ్. ఇప్పుడీ సినిమా షూటింగ్ క్లయిమాక్స్ కు చేరుకుంది.

'వారసుడు' చివరి షెడ్యూల్ షూటింగ్ నిన్న ప్రారంభమైయింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి కేవలం 2 యాక్షన్ సీక్వెన్సులు, 2 పాటలు మాత్రమే పెండింగ్. ఆ రెండూ పూర్తి చేసి, 2023 సంక్రాంతి కానుకగా వారసుడు సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న తొలి స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే. రష్మిక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త కీలక పాత్రలు పోషిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు.

తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

First Published:  26 Sep 2022 2:27 PM GMT
Next Story