Telugu Global
Cinema & Entertainment

కోలీవుడ్ లోకి ఎంటరైన యూవీ క్రియేషన్స్

తెలుగులో సాహో, రాధేశ్యామ్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థ, ఇప్పుడు కోలీవుడ్ లో అడుగుపెట్టింది. సూర్య హీరోగా స్టుడియో గ్రీన్ తో కలిసి సినిమా స్టార్ట్ చేసింది.

కోలీవుడ్ లోకి ఎంటరైన యూవీ క్రియేషన్స్
X

విలక్షణ పాత్రలతో తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్ సూర్య. మాస్ కమర్షియల్ సినిమాలతో అగ్ర దర్శకుడిగా ఎదిగిన వ్యక్తి శివ. ఇప్పుడీ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా మొదలైంది. ఈ సినిమాతో యూవీ క్రియేషన్స్ సంస్థ కోలీవుడ్ లో అడుగుపెట్టింది.

యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌తో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తోంది. మొదట్నుంచి కమర్షియల్ తో పాటు వినూత్నమైన కథలను ఎన్నుకుంటూ.. మిర్చి, మహానుభావుడు, భలే భలే మగాడివోయ్, బాగమతి లాంటి ఎన్నో విజయాలతో అగ్ర నిర్మాణ సంస్థగా నిలిచింది యూవీ క్రియేషన్స్. ఇప్పుడీ సంస్థ సూర్య సినిమాతో కోలీవుడ్ లో ఎంటరైంది. అటు స్టుడియో గ్రీన్ కు ఇది ప్రతిష్టాత్మక 25వ చిత్రం కావడం విశేషం.

ఈ సినిమా షూటింగ్ మొదలైంది. చిత్ర యూనిట్‌తో పాటు అతిరథ మహారధుల సమక్షంలో ఓపెనింగ్ జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఓపెనింగ్ కు అతడు కూడా వచ్చాడు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రాబోతున్నాయి.

శివ-అజిత్ ది సూపర్ హిట్ కాంబినేషన్. ఇప్పుడు సూర్య-శివది కూడా హిట్ కాంబినేషన్ గా మారుతుందని కోలీవుడ్ జనాలు అంచనాలు కడుతున్నారు.

First Published:  25 Aug 2022 5:48 AM GMT
Next Story