Telugu Global
Cinema & Entertainment

Mega 157 | యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై చిరంజీవి సినిమా

UV Creations Chiranjeevi - వశిష్ఠ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు చిరంజీవి. ఈ విషయాన్ని ఈరోజు యూవీ క్రియేషన్స్ బ్యానర్ అధికారికంగా ప్రకటించింది.

Mega 157 | యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై చిరంజీవి సినిమా
X

ఇది మీ ఊహకు మించి ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి మరో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవిని చూడాలని ఉత్సాహంగా ఉన్న అభిమానులు ఈ అనౌన్స్ మెంట్ తో మరింత సంతోషిస్తారు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక ఫాంటసీ మూవీకి సైన్ చేశారు.

‘బింబిసార’తో మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ ప్రతిష్టాత్మక చిత్రం రాబోతోంది. కెరీర్ లో చిరంజీవికి ఇది 157వ చిత్రం. వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మాతలు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఈరోజు అఫీషియల్ గా ఈ సినిమాను ఎనౌన్స్ చేశారు. ప్రకటనలో భాగంగా కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం (పంచభూతాలు) నక్షత్ర ఆకారపు ఎలిమెంట్, త్రిశూలంతో ఆవరించి ఉన్నాయి. ఈ అద్భుతమైన పోస్టర్ తో సినిమా జానర్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

రీసెంట్ గా భోళాశంకర్ సినిమాతో థియేటర్లలోకి వచ్చారు చిరంజీవి. ఆ సినిమా ఫలితం నిరాశపరిచింది. ఆ ప్రభావంతో, వశిష్ఠ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను చిరంజీవి హోల్డ్ లో పెట్టినట్టు వార్తలొచ్చాయి. కానీ తాజా ప్రకటనతో అవన్నీ అవాస్తవాలని తేలాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రాబోతున్నాయి.

First Published:  22 Aug 2023 2:46 PM GMT
Next Story