Telugu Global
Cinema & Entertainment

Ustaad Bhagat Singh: అదిరిపోయే టైటిల్ ట్రాక్

Ustaad Bhagat Singh: పవన్ హీరోగా రాబోతున్న ఈ సినిమా కి సంబంధించి టైటిల్ సాంగ్ రికార్డ్ చేశారు

Ustaad Bhagat Singh: అదిరిపోయే టైటిల్ ట్రాక్
X

పవన్ కల్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ఒక్కటే. అదే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు. ఈ సినిమా తర్వాత వినోదాయశితం రీమేక్ ను ఆయన స్టార్ట్ చేసే అవకాశం ఉంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో ఎవ్వరికీ తెలియదు.ట


అలా ఈ సినిమా పనులు ఆగిపోయాయని అంతా అనుకుంటున్నారు. కానీ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మరీ ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.


పవన్ కల్యాణ్ హీరోగా రాబోతున్న ఉస్తాబ్ భగత్ సింగ్ కోసం తాజాగా ఓ ర్యాంప్ సాంగ్ కంపోజ్ చేశారట. దేవిశ్రీ ప్రసాద్ ఈ సాంగ్ ను అద్భుతంగా ట్యూన్ చేశాడట. పవన్ నుంచి కూడా ఈ పాటకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇలా ఉస్తాద్ సినిమా పనులు నడుస్తూనే ఉన్నాయి.


హరిహర వీరమల్లు తర్వాత పవన్ ఏ సినిమా చేస్తారనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. వీరమల్లు సినిమా షూటింగ్ మార్చితో పూర్తవుతుంది. ఆ తర్వాత పవన్ తదుపరి సినిమాపై క్లారిటీ వస్తుంది.

First Published:  14 Jan 2023 10:47 AM GMT
Next Story