Telugu Global
Cinema & Entertainment

Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ సినిమా ఆగలేదంట

Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఆగిపోలేదంట. ఈ మేరకు యూనిట్ ప్రకటన చేసింది.

Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ సినిమా ఆగలేదంట
X

Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ సినిమా ఆగలేదంట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా ఈ సినిమా షూట్ నడుస్తోంది. మేకర్స్ రెండు వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేయడం ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.

ఈ పోస్టర్లలో పవన్ కళ్యాణ్ ఖాకీ డ్రెస్ లో బ్లాక్ షేడ్స్ తో మ్యాచో గా కనిపిస్తున్నాడు. ఒక పోస్టర్‌లో దర్శకుడు హరీష్ శంకర్‌తో సీరియస్‌గా మాట్లాడుతున్నట్లు కనిపిస్తుండగా, మరొక పిక్చర్ లో సెట్‌లో నడుచుకుంటూ వస్తున్నట్లు కనిపించాడు.

నిజానికి ఈ స్టిల్స్ ఇప్పుడు రిలీజ్ చేయాలని అనుకోలేదు. గడిచిన 2 రోజులుగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన యూనిట్, తన సినిమా షూటింగ్ ఆగలేదని ప్రకటిస్తూ, ఇలా 2 స్టిల్స్ విడుదల చేసింది.

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్.

అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా ఈ సినమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

First Published:  14 Sep 2023 5:37 PM GMT
Next Story