Telugu Global
Cinema & Entertainment

USA Top 10 - అమెరికాలో టాప్-10 భారతీయ చిత్రాలు

USA Top 10 - ఓ ఏడాది ముగిస్తోంది. మరి 2023లో యూఎస్ఏలో టాప్-10 లిస్ట్ లో నిలిచిన సినిమాలేంటి?

USA Top 10 - అమెరికాలో టాప్-10 భారతీయ చిత్రాలు
X

ఈ ఏడాది పఠాన్, జవాన్, యానిమల్, సలార్ సినిమాలొచ్చాయి. ఇవన్నీ వేటికవే సూపర్ హిట్స్ సాధించాయి. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో కళ్లుచెదిరే వసూళ్లు సాధించాయి. దీంతో ఓవర్సీస్ లో టాప్-10 సినిమాల ఆర్డర్ మారింది.

షారూక్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్టవ్వడంతో, యూఎస్ టాప్-10 సినిమాల లిస్ట్ లో సౌత్ సినిమాల ప్రాధాన్యం తగ్గింది. అలా బాలీవుడ్ తన పట్టును నిలుపుకుంది. దీనికితోడు యానిమల్ హిట్టవ్వడం కూడా బాలీవుడ్ కు కలిసొచ్చింది.

అయితే ఎన్ని సినిమాలొచ్చినా, ఎన్ని హిట్స్ సాధించినా, బాహుబలి-2 ను మాత్రం బీట్ చేయలేకపోతున్నాయి. ఇప్పటికీ యూఎస్ బాక్సాఫీస్ లో బాహుబలి-2దే అగ్రస్థానం. ఇక సలార్ విషయానికొస్తే, ప్రస్తుతం ఓవర్సీస్ లో ఇది భారీ వసూళ్లు సాధిస్తోంది. లాంగ్ రన్ లో ఇది టాప్-10లో ఏ స్థానాన్ని చేరుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఇంకా ఈ సినిమా టాప్-10 లిస్ట్ లో చేరలేదు.

యూఎస్ లో టాప్-10లో కొనసాగుతున్న ఇండియన్ మూవీస్ లిస్ట్ చూద్దాం...

1. బాహుబలి 2 - $ 22 మిలియన్

2. పఠాన్ - $ 17.49 మిలియన్

3. జవాన్ - $ 15.23 మిలియన్

4. యానిమల్ - $ 14.33 మిలియన్

5. ఆర్ఆర్ఆర్ - $ 14.32 మిలియన్

6. దంగల్ - $12.19 మిలియన్

7. పద్మావత్ - $ 12.17 మిలియన్

8. పీకే - $ 10.62 మిలియన్

9. రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ - $ 10.60 మిలియన్

10. బాహుబలి 1 - $ 8.48 మిలియన్

First Published:  26 Dec 2023 4:56 PM GMT
Next Story