Telugu Global
Cinema & Entertainment

Urvashi Rautela | బాలయ్య సరసన 'వాల్తేరు' బ్యూటీ

Urvashi Rautela - టాలీవుడ్ బాంబ్ షెల్ ఊర్వశి రౌతేలా, ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ కు షిఫ్ట్ అయింది. బాలయ్య సినిమాలో కీలక పాత్ర పోషించబోతోంది.

Urvashi Rautela | బాలయ్య సరసన వాల్తేరు బ్యూటీ
X

ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాకు టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్‌లో ఆమెకు ఆఫర్లు తగ్గినప్పటికీ, టాలీవుడ్ నుంచి ఆమెకు వరుసగా సినిమాలొస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 4 చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌లో కనిపించింది ఊర్వశి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి "బాస్ పార్టీ" సాంగ్ కూడా ఉంది. ఇప్పుడీ ముద్దుగుమ్మ, నందమూరి బాలకృష్ణతో కలిసి నటించబోతోంది. అయితే ఇది ఐటెంసాంగ్ మాత్రం కాదు.

వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత బాలయ్య హీరోగా ఓ మూవీ చేస్తున్నాడు దర్శకుడు బాబి. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఊర్వశి రౌతేలాను తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఐటెం బాంబ్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్న ఊర్వశి, ఈ కొత్త ప్రత్యేక పాత్రలో ఎలా రాణిస్తుందో చూడాలి.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతోంది. కానీ సినిమాకు సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు వెల్లడించలేదు. త్వరలోనే ఓ మంచి పోస్టర్ తో సినిమా వివరాల్ని వెల్లడించబోతున్నారు.

బాలయ్య కెరీర్ లో 109వ చిత్రం ఇది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి సరిగ్గా నెల రోజులైంది. షూటింగ్ మొదలైన రోజు, మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు. ఆ పోస్టర్ ఎంతో సృజనాత్మకంగా ఉంది. పదునైన గొడ్డలి, ఆంజనేయ స్వామి తాయెత్తును పోస్టర్ లో చూపించారు. ఇక గొడ్డలిపై ఉంచిన కళ్ళద్దాలలో అసురులపై నరసింహ స్వామి ఉగ్రరూపం చూపుతున్న ప్రతిబింబాన్ని చూపించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అదే లాస్ట్ అప్ డేట్.

First Published:  6 Dec 2023 2:21 PM GMT
Next Story