Telugu Global
Cinema & Entertainment

Uppena BuchiBabu: ఉప్పెన దర్శకుడి కెరీర్ లో భారీ గ్యాప్

Uppena BuchiBabu: ఉప్పెనతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ దర్శకుడు ఇప్పటివరకు తన రెండో సినిమా ప్రకటించలేకపోయాడు. ఎన్టీఆర్ సినిమా కూడా చేజారిపోయింది.

Uppena BuchiBabu: ఉప్పెన దర్శకుడి కెరీర్ లో భారీ గ్యాప్
X

ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీని ఆకర్షించాడు దర్శకుడు బుచ్చిబాబు. ఆ సినిమాతో టాలీవుడ్ కు మరో టాలెంటెడ్ డైరక్టర్ దొరికాడని అంతా సంబరపడ్డారు. బుచ్చిబాబు కూడా జాగ్రత్తగా తన కెరీర్ ను ప్లాన్ చేసుకున్నారు. ఉప్పెన తర్వాత ఎన్టీఆర్ ను డైరక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. కానీ ఇప్పుడు అతడి ప్లాన్స్ అన్నీ రివర్స్ అయ్యేలా ఉన్నాయి

ఉప్పెన తర్వాత బుచ్చిబాబు కెరీర్ లో ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్ లో ఉప్పెన హీరో 2 సినిమాలు రిలీజ్ చేశాడు. ఉప్పెన హీరోయిన్ అయితే లెక్కలేనన్ని సినిమాలు చేసేసింది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు మాత్రం ఇప్పటివరకు సినిమా చేయలేదు సరికదా, కనీసం కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు కూడా.

ఉప్పెన రిలీజ్ అయిన వెంటనే ఎన్టీఆర్ కోసం కథ రాసే పనిలో పడ్డాడు బుచ్చిబాబు. దాదాపు ఏడాదిన్నర కష్టపడి కథ రెడీ చేసుతున్నాడు. ఎన్టీఆర్ కు కూడా ఇది ఓ మోస్తరుగా నచ్చింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా చేయలేనని తారక్ చెప్పేశాడు.

ఆర్ఆర్ఆర్ తర్వాత తన ఇమేజ్ ను పాన్ ఇండియా లెవెల్లో బిల్డ్ చేసుకునే పనిలో పడ్డాడు ఎన్టీఆర్. ఇందులో భాగంగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయబోతున్నాడు.

ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే బుచ్చిబాబు చెప్పిన కథ గురించి ఆలోచిస్తానని తెగేసి చెప్పేశాడు. ఈలోగా ఇతర హీరోలతో సినిమాలు చేసుకోవాలని కూడా బుచ్చిబాబుకు చెప్పేశాడు తారక్. అదీ సంగతి.

First Published:  17 Nov 2022 3:30 AM GMT
Next Story