Telugu Global
Cinema & Entertainment

Upendra | టీజర్ రిలీజ్ చేశాడు, ఓపెన్ చేస్తే మొత్తం చీకటి

Upendra's UI Movie - డిఫరెంట్ గా సినిమాలు తీసే ఉపేంద్ర, ఈసారి కూడా అదే పద్ధతి ఫాలో అయ్యాడు. తను తీసే సినిమాకు వెరైటీ టీజర్ రిలీజ్ చేశాడు.

Upendra | టీజర్ రిలీజ్ చేశాడు, ఓపెన్ చేస్తే మొత్తం చీకటి
X

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ప్రయోగాలకు పెట్టింది పేరు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఉపేంద్ర తీసిన సినిమాలు సంచలనాలు సృష్టించాయి. అయితే ఆ తర్వాత ఉపేంద్ర తన పంథా మార్చాడు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ హీరో నుంచి, అతడి మార్క్ సినిమా వస్తోంది. దీని పేరు UI.

తన పుట్టినరోజు సందర్భంగా, మోస్ట్ ఎవైటింగ్ ప్రాజెక్ట్ ‘యూఐ: ది మూవీ’ నుంచి టీజర్ రిలీజ్ చేశాడు ఉపేంద్ర. లహరి ఫిలింస్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా నుంచి టీజర్ ఇలా రిలీజైన వెంటనే అలా వైరల్ అయింది. సాధారణంగా టీజర్ లో సినిమా నుంచి మంచి విజువల్స్ ను కట్ చేసి చూపిస్తారు. కానీ యూఐ టీజర్ లో మాత్రం పూర్తిగా చీకటి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, ఎలాంటి సన్నివేశాలు కనిపించవు. చివరికి ఫొటోలు కూడా లేవు. కేవలం బ్యాక్ గ్రౌండ్ నుంచి వాయిస్ మాత్రమే వినిపిస్తుంది.

ఉపేంద్ర తన డైరెక్షన్ తో చాలా పేరు పొందారు. IMDBలో ప్రపంచంలోని టాప్ 20 ఉత్తమ దర్శకులలో స్థానం సంపాదించుకున్నారు. వీడియోలో ఒక్క ఫ్రేమ్ కూడా విజువల్ లేకుండా సినిమా టీజర్‌ను విడుదల చేయడం ద్వారా తన సృజనాత్మక దృష్టిని మరోసారి ప్రదర్శించారు. ఈ టీజర్ అభిమానులను అబ్బురపరిచింది. ఈ టీజర్‌ ని ప్రత్యేకం గా నిలిపిన అంశం ఏమిటంటే.. విజువల్ ఫ్రేమ్ లేకుండా డాల్బీ అట్మోస్ సౌండ్ ఎక్స్ పీరియన్స్ తో కట్టిపడేసింది.

ఈ ఆడియో టీజర్ ఫిల్మ్ మేకింగ్ చరిత్రలో ఒక సంచలనంగా నిలిచింది. 3D సౌండ్ ఎఫెక్ట్‌లతో ప్రేక్షకులని ఉత్కంఠతో ముంచెత్తుతుంది. టీజర్ క్లైమాక్స్ లో ‘ఇది ఏఐ వరల్డ్‌ కాదు. ఇది యూఐ వరల్డ్‌. దీని నుంచి తప్పించుకోవాలంటే, మీ తెలివితేటలను వాడండి’’అనే వాయిస్ మరింత క్యూరియాసిటీని పెంచింది. యూఐ: ది మూవీ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.

First Published:  19 Sep 2023 4:45 PM GMT
Next Story