Telugu Global
Cinema & Entertainment

#UI | ఉపేంద్ర ఫాంటసీ ప్రపంచం

Upendra's UI - ఉపేంద్ర తాజా చిత్రం యూఐ. ఈ సినిమాతో ఓ సరికొత్త ఫాంటసీ ప్రపంచాన్ని చూపించబోతున్నాడు ఈ హీరో కమ్ దర్శకుడు.

#UI | ఉపేంద్ర ఫాంటసీ ప్రపంచం
X

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తున్న తన తాజా చిత్రం #యూఐ ది మూవీ. ఈ సినిమా టీజర్ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. లహరి ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

తన విలక్షణమైన స్టొరీ టెల్లింగ్ తో ప్రసిద్ధి చెందిన ఉపేంద్ర ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌తో ముందుకు వచ్చారు. బర్త్ డే గింప్స్ ద్వారా తన క్రియేటివ్ విజన్ ప్రదర్శించిన ఆయన వీక్షకులను ఫాంటసీ ప్రపంచలోకి తీసుకెళ్ళారు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు ఈ కార్యక్రమానికి అతిధి గా హాజరయ్యారు.

“ఎటు చూసిన చీకటి. దాన్నుంచి తప్పించుకోవడం ఎలా?” అని ఉపేంద్ర వాయిస్‌తో టీజర్‌ ఓపెన్‌గా.. సినిమా కోసం నిర్మించిన వరల్డ్ అద్భుతంగా అనిపిస్తూ ఆసక్తిని పెంచింది. చివరగా, ఎద్దుపై ఎంట్రీ ఇచ్చిన ఉపేంద్ర... ఇందులో ఎలాంటి వీరోచిత పాత్ర పోషిస్తున్నారో తెలియజేస్తుంది. గ్రాండ్ విజువల్స్, ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, ఆకట్టుకునే సంగీతం సరికొత్త అనుభూతిని అందిస్తాయి.

మేకర్స్ చెప్పినట్లుగా మొత్తం సీక్వెన్స్ వర్చువల్ రియాలిటీ పైప్‌లైన్‌లో చిత్రీకరించారు. ఇండస్ట్రియల్ లైట్ & మ్యాజిక్ (ILM) క్రియేషన్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. దాదాపు 90శాతం గ్రాఫిక్స్ కనిపిస్తాయి. వీటిని 4 వేర్వేరు స్టూడియోలలో చేస్తున్నారు.

అజనీష్ లోక్‌నాథ్ (కాంతారావు ఫేమ్) ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇందులో రీష్మా నానయ్య, నిధి సుబ్బయ్య, మురళీ శర్మ, పి రవిశంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

First Published:  9 Jan 2024 5:19 PM GMT
Next Story