Telugu Global
Cinema & Entertainment

Upendra - కబ్జా సినిమాలో నా కష్టాన్ని ప్రేక్షకులు గుర్తిస్తారు

Upendra Kabzaa movie - కబ్జా మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో తను పడిన కష్టాన్ని అంతా గుర్తిస్తారని చెబుతున్నాడు ఉపేంద్ర.

Upendra - కబ్జా సినిమాలో నా కష్టాన్ని ప్రేక్షకులు గుర్తిస్తారు
X

ఉపేంద్ర హీరోగా నటిస్తున్న కొత్త సినిమా కబ్జా. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది. పునీత్ రాజ్‌కుమార్ జ‌యంతి సంద‌ర్భంగా మార్చి 17న తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది.

తెలుగులో నిర్మాత ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌కుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎన్-సినిమాస్ ప‌తాకాల‌పై ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా కబ్జా మూవీ ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా తన మూడేళ్ల కష్టం అంటున్నాడు ఉపేంద్ర.

"విజువ‌ల్ గ్రాండియ‌ర్ మూవీ ఇది. మూడేళ్లుగా ఈ సినిమా చేస్తున్నాం. దీని క్రెడిట్ అంతా చంద్రుకి ద‌క్కుతుంది. ఆయ‌న క‌ల ఈ సినిమా. 2-3 సార్లు క‌రోనా వేవ్స్ వ‌చ్చాయి. చాలా స‌మ‌స్య‌లు ఏర్ప‌డిన‌ప్ప‌టికీ ఇలాగే నేను సినిమా చేయాల‌ని చంద్రు డిసైడ్ అయ్యి సినిమా చేశాడు. ఆయన కష్టంతో పాటు నా కష్టాన్ని ప్రేక్షకులు గుర్తిస్తారు."

తన మార్క్ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారన్న ఉపేంద్ర.. త్వరలోనే స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ యుఐ అనే సినిమా చేస్తున్నానని తెలిపాడు ఉపేంద్ర.

First Published:  13 March 2023 4:45 PM GMT
Next Story