Telugu Global
Cinema & Entertainment

సాయి తేజ్ సినిమాపై అప్ డేట్ ఇదే!

ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సాయితేజ్. ఈ మూవీకి సంబంధించి అప్ డేట్ వచ్చింది.

సాయి తేజ్ సినిమాపై అప్ డేట్ ఇదే!
X

కరోనా వల్ల ఆగిపోయిన సినిమాల్లో సాయిధరమ్ తేజ్ మూవీ కూడా ఉంది. చాన్నాళ్ల కిందటే సెట్స్ పైకి రావాల్సిన ఆ సినిమా లేట్ అయింది. ఆ తర్వాత సాయితేజ్ కు ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో, షూటింగ్ మరింత ఆలస్యమైంది. అలా ఆలస్యంగా మొదలైన సాయితేజ్ కొత్త సినిమాకు సంబంధించి అప్ డేట్ వచ్చింది.

కార్తీక్ దండు దర్శకత్వంలో సాయితేజ్ నటిస్తున్న సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. సాయితేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో కాగడా పట్టుకొని, ఆవేశంగా నిల్చున్నాడు సాయితేజ్. అతడి ముందున్న ప్రజలు కూడా అంతే ఆవేశంగా ఉన్నారు.

ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. టైటిల్ తో పాటు గ్లింప్స్ ను త్వరలోనే విడుదల చేస్తామని మేకర్స్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఇక సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా విడుదల చేస్తామని ప్రకటించారు.

ఈ సినిమాకు కన్నడ స్టార్ కంపోజర్ అజనీష్ లోక్ నాథ్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. భీమ్లానాయక్, బింబిసార సినిమాల ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. SVCC బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇదొక మిస్టరీ థ్రిల్లర్. ఈ జానర్ లో సాయితేజ్ నటిస్తున్న తొలి సినిమా ఇదే. ఈ సినిమాకు రుద్రవనం అనే టైటిల్ అనుకుంటున్నారు.




First Published:  15 Oct 2022 1:23 PM GMT
Next Story